- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Nutritional deficiencies: మహిళల్లో పోషకాహార లోపాలు.. లక్షణాలు- నివారణ..
దిశ, వెబ్‌డెస్క్: గోర్లు పెళుసుగా మారడం, తరచుగా కండరాల తిమ్మిరి(Muscle cramps), వేళ్లలో తిమ్మిరి, దంత సమస్యలు(Dental problems), జలదరింపు, అలసట, బోలు ఎముకల వ్యాధి(Osteoporosis) వంటివి మహిళల్లోని కాల్షియం లోపం(Calcium deficiency) లక్షణాలు. తీవ్రమైన లోపం అసాధారణ గుండె లయలు, మానసికంగా గందరగోళానికి కూడా కారణమవుతుంది. సమాజానికి వెన్నెముకగా ఉండే మహిళలే ఇలాంటి సమస్యల్ని నిర్లక్ష్యం చేస్తే ముప్పు తప్పదంటున్నారు నిపుణులు. బిజీ షెడ్యూల్ కారణంగా ఆరోగ్యాన్ని పక్కన పెట్టడం సరికాదు. కాగా స్త్రీలు పోషకాహారాలతో కూడిన ఆహారాన్ని తీసుకోవాలని తాజాగా నిపుణులు సూచిస్తున్నారు. మరీ మహిళల్లో పోషకాహార లోపం ఏర్పడితే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి..? దానికి పరిష్కారమేంటో ఇప్పుడు చూద్దాం..
మహిళల్లో ఐరన్ లోపం ఏర్పడితే బలహీనంగా మారిపోతారు. గర్భం(pregnancy), బుుతుస్రావం(menstruation), చనుబాలివ్వడం వంటి కారణాల వల్ల స్త్రీలు ఎక్కువగా ఐరన్ లోపానికి లోనౌతారు. బలహీనత, అలసట, మైకము, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, లేత చర్మం, ఇన్ఫెక్షన్(infection) బారిన పడడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే ఈ సమస్యకు చెక్ పెట్టాలంటే గొర్రె మాంసం(Mutton), బచ్చలికూర, పౌల్ట్రీ, సీఫుడ్, బలవర్థకమైన తృణధాన్యాలు, వంటివి తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. వీటితో పాటుగ విటమిన్ సి అధికంగా ఉండే ఆహారం తినాలి.
ఒత్తిడి, హార్మోన్లలో మార్పుల కారణంగా మెగ్నీషియం లోపం(Magnesium deficiency) ఏర్పడుతుంది. మహిళల్లో ఈ లోపం ఏర్పడితే.. ఆందోళన కండరాల తిమ్మిరి, క్రమరహిత హృదయ స్పందన(Irregular heartbeat), మైగ్రేషన్(Migration) వంటి లక్షణాలు కనిపిస్తాయి. కాగా గింజలు, తృణ ధాన్యాలు(Whole grains) వంటి మెగ్నీషియం అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవాలి.
గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. మీ అవగాహన కోసం నిపుణులు అందించిన సమాచారం మాత్రమే అందిస్తున్నాం. పై వార్తలో మీకు అనుమానాలు ఉంటే కనుక నిపుణులకు సంప్రదించగలరు.