- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
Nusrat Jahan: ఇంట్లో కూర్చుని మసాలా చూడండి.. 'కాళీ' పోస్టర్ విమర్శలపై నుస్రత్
దిశ, సినిమా : Nusrat Jahan Reacts To Leena Manimekalai's Kaali Poster Controversy| ప్రముఖ దర్శకురాలు లీనా మణిమేకలై తెరకెక్కించిన 'కాళీ' చిత్ర పోస్టర్ చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. కాగా ఇదే ఇష్యూపై బాలీవుడ్ నటి నుస్రత్ జహాన్ తాజాగా తన అభిప్రాయాన్ని వెల్లడించింది. కాళీదేవి వేషధారణలో ఉన్న స్త్రీ సిగరెట్ తాగుతున్నట్లు చూపించడం పట్ల తమ మతవిశ్వాసాలు దెబ్బతిన్నాయని అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న వాళ్లకు పలు ప్రశ్నలు సంధించింది. తాను ఎవరినీ తక్కువ చేసేందుకు లేదా కించపరిచేందుకు మాట్లాడట్లేదని, అలాంటి ఉద్దేశం కూడా తనకు లేదన్న నుస్రత్.. 'మనం మళ్లీ మతాన్ని బజారుకు లాగి అమ్మకానికి పెట్టాం. మీరందరూ ఇంట్లో కూర్చుని ఈ మసాలా చూడటం మంచిది.
నేను ఎప్పుడూ సృజనాత్మకతతో పాటు గొప్ప వ్యక్తిత్వానికే మద్దతు ఇస్తా. అలాగే ఎవరి మతపరమైన మనోభావాలను దెబ్బతీయకూడదని బలంగా నమ్ముతా. అందుకే నాకు తెలిసినంత వరకు క్రియేటివిటీని మతంతో ముడిపెట్టడం సరైనది కాదు' అని వివరించింది. ఇక ఈ బ్యూటీ ఇటీవల ఎరుపు, బంగారు రంగు వర్ణపు చీర, చేతిలో త్రిశూలంతో దుర్గాదేవి వేషధారణలో కనిపించిన విషయం తెలిసిందే. అయితే 'ఒక ముస్లిం యువతి హిందూ దేవతగా ఎలా కనిపిస్తుంది' అంటూ కొంతమంది తనను చంపేస్తామంటూ భయాందోళనకు గురిచేశారు.
- Tags
- Nusrat Jahan