- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కెమెరా కోసమే పుట్టిన నటుడు.. ఆ ఒక్క పాటతో అందనంత ఎత్తుకు
దిశ, సినిమా: 'కొమురం భీముడో.. తారక రాముడో.. నీ నటనకు మేమంతా దాసోహం కొడుకో!! ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే మంత్రం. ఏ యూట్యూబ్ చానల్ చూసినా ఆ పాటలో జూనియర్ ఎన్టీఆర్ యాక్టింగ్ పైనే చర్చ. తాత తండ్రుల నుంచి పొందిన నట వారసత్వం, చిన్నవయసులోనే జీవితాన్ని చదివేసిన పరిణతి, పాత్ర తాలూకూ ఆర్థ్రతను ఆకళింపు చేసుకునే లక్షణాలే ఎన్టీఆర్‌ను సంపూర్ణ నటుడిని చేశాయనేది ప్రముఖుల మాట. ఇక 'ఆర్‌ఆర్‌ఆర్' ప్రమోషన్స్‌లో రాజమౌళి చెప్పినట్లు.. తన బలమేంటో ఎన్టీఆర్‌కు పూర్తిగా తెలుసు. అదే సమయంలో డైరెక్టర్ విజన్‌పైనా స్పష్టమైన అవగాహన తన సొంతం. అందుకేనేమో అనేకమంది సెలబ్రిటీల ఒపీనియన్ ప్రకారం 'ఎన్టీఆర్ కెమెరా కోసమే పుట్టిన నటుడు'.
నిజానికి 'ఆర్‌ఆర్‌ఆర్'లో రాజమౌళి సృష్టించిన విజువల్ వండర్స్ గురించి ఎంతగా మాట్లాడుకుంటున్నారు? రాంచరణ్ ఎమోషనల్ పర్ఫార్మెన్స్‌కు ఏ స్థాయి గుర్తింపు దక్కింది? పక్కనబెడితే .. గోండు యువకుడి పాత్రకు ప్రాణప్రతిష్ట చేసిన ఎన్టీఆర్ అసమాన నటనను వర్ణించలేం. నిజానికి క్యారెక్టర్ ఎలివేషన్, కథలో ఇంపార్టెన్స్, పర్‌ఫార్మెన్స్ స్కోప్.. ఇలా ఎన్నో అంశాలు రాంచరణ్‌కు అడ్వాంటేజ్‌గా మారాయి. చెర్రీ కూడా కెరీర్ బెస్ట్ ఇచ్చాడనడంలో సందేహం లేదు. కానీ తన పాత్ర పరిమితిలోనే పవర్‌ఫుల్ ఇంపాక్ట్ క్రియేట్ చేయడంలో మాత్రం ఎన్టీఆర్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యాడు.
ప్రత్యేకించి సినిమాకు ఆయువుపట్టుగా నిలిచిన 'కొమురం భీముడో' పాటలో ఎన్టీఆర్ పలికించిన హావభావాలు, ఒలికించిన దేహ భాష.. బహుశా ఈ తరం టాలీవుడ్ నటుల్లో ఎవరికీ సాధ్యపడదేమో. అందుకే సినిమా మొత్తంగా రాంచరణ్ పర్ఫార్మెన్స్‌కు ఒక్క మూడు నిమిషాల పాటతోనే పోటీఇచ్చి తన నటనలోని పొటెన్షియాలిటీ చూపించగలిగాడు ఎన్టీఆర్. పర్టిక్యులర్ సాంగ్ విషయానికొస్తే.. తన గోండు జాతి కోసం బలిదానానికైనా సిద్ధమే అన్నట్లుగా భీమ్ కళ్లలో చూపిన తెగువ.. ఒంటిని చీల్చుతున్న కొరడా దెబ్బలను లెక్కచేయనట్లుగా ప్రదర్శించిన పొగరు.. ప్రేక్షకులను చూపు తిప్పుకోనివ్వలేదంటే అతియోక్తి కాదు. ఇక ఇంటర్వెల్ సీన్‌లోనూ ఎన్టీఆర్ యాక్టింగ్ స్కిల్స్ పీక్స్ అని చెప్పొచ్చు.
ఇవి కూడా చదవండి : 'ఆర్ఆర్ఆర్' నుంచి అదిరిపోయే అప్‌డేట్.. రెండో పార్ట్ పక్కా: విజయేంద్ర ప్రసాద్