Malasanam: ఫిట్‌నెస్ మాత్రమే కాదు.. ఈ ఆసనంలో కూర్చుని వాటర్ తాగితే శరీరం మొత్తం..

by Anjali |   ( Updated:2024-10-22 11:30:21.0  )
Malasanam: ఫిట్‌నెస్ మాత్రమే కాదు.. ఈ ఆసనంలో కూర్చుని వాటర్ తాగితే శరీరం మొత్తం..
X

దిశ, వెబ్‌డెస్క్: యోగా (Yoga) ఆసనాలు చేస్తే శరీరం, ఆత్మను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఆసనాలు మిమ్మిల్ని ఫిట్ ఉంచడానికి మేలు చేస్తాయి. అంతేకాకుండ ఒత్తిడి, ఆందోళన నుంచి ఉపశమనం కలిగిస్తాయి. రిలాక్స్‌గా ఉంచుతాయి. ప్రతిరోజూ యోగా చేస్తే పూర్తి ఆరోగ్యంగా ఉంటారని తరచూ నిపుణులు చెబుతూనే ఉంటారు. కాగా మలాసనాన్ని(Malasanam ) చేయడం ద్వారా చాలా ప్రయోజనం ఉంటుంది. అయితే ఈ మలాసనంలో కూర్చుని వాటర్ తాగితే కూడా బోలెడన్నీ లాభాలు మీ సొంతమవుతాయి. కాగా మలాసనం ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం..

మలాసనం చేసే విధానం..

ముందుగా పాదాలను తొడల దగ్గర వెడల్పుకు ఇక్వల్ ఉంచాలి. పాదాల మీద కూర్చుని.. స్క్వాట్ పొజిషన్(Squat position)లోకి వచ్చి.. మీ మోకాళ్లను వంచాలి. తర్వాత బ్యాక్ నేలకు ఆనించాలి. ఇప్పుడు అరచేతులను హృదయానికి ముందు నమస్కార స్థితిలో ఉంచాలి. తర్వాత మడమలు నేలపై ఉంచి.. వెన్నెముక నిటారుగా పెట్టాలి. ఇప్పుడు కాస్త సౌకర్యవంతంగా అనిపిస్తుంది. ఈ క్రమంలో గ్లాసుతో గోరు వెచ్చని వాటర్ తాగాలి.

కలిగే లాభాలు..

మలాసనంలో కూర్చుని వాటర్ తాగితే బాడీ హైడ్రేట్(Hydrate the body )అవుతుంది. శరీరంలో ఉన్న చెడు పదార్థాలను బయటికి పంపడానికి మేలు చేస్తుంది. శరీరాన్ని ఈ చిన్న పని మొత్తం డిటాక్స్ చేస్తుందని చెప్పవచ్చు. అలగే జీర్ణక్రియకు మేలు చేస్తుంది. మలబద్ధకం వంటి సమస్యలు దూరం అవుతాయి. కడుపు సమస్యలు ఉన్నవారు ప్రతిరోజూ ఈ ఆసనం చేస్తే ఉపశమనం కలుగుతుంది.

గమనిక: పై వార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు.కేవలం మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.

Advertisement

Next Story