- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చట్టాలు వెనక్కి తీసుకోవడంపై కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఈశాన్య రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో కేంద్ర సాయుధ బలగాల ప్రత్యేక చట్టాల వెనక్కి తీసుకోవడంపై కీలక వ్యాఖ్యలు చేశారు. తాజా నిర్ణయంతో భారత్ మెయిన్ స్ట్రీమ్‌లో ఈశాన్య ప్రాంతాలు భాగమయ్యాని అన్నారు. శనివారం ఆయన ఆఫ్స్పా చట్టాల వెనక్కి తీసుకోవడంపై మీడియాతో ప్రసంగించారు. 'నేను గర్వం, సంతృప్తితో మిమ్మల్ని కలిసాను. మొదటి సారిగా మెయిన్ స్ట్రీమ్‌లోకి ఈశాన్య ప్రాంతం భాగమైన భావన కలుగుతుంది.
మనం ఎప్పుడు ఈశాన్య ప్రాంతాలు మెయిన్ స్ట్రీమ్‌కు అనుసంధానం చేయబడుతాయని నమ్ముతున్నాం. కానీ, ఇప్పటికే దేశంలోని మెయిన్‌స్ట్రీమ్‌లో కలిసిందని చెప్తున్నాను అని తెలిపారు. ప్రధాని మోడీ ఈశాన్య ప్రాంతానికి ప్రాధాన్యత కల్పించి సరికొత్త మార్పులు తీసుకొచ్చారని అన్నారు. తాజాగా సాయుధ బలగాల వెనక్కి తీసుకునే నిర్ణయంతో ఆ ప్రాంతంలో శాంతి వెనక్కి వచ్చిందని సూచిస్తాయని అన్నారు. కేంద్రం కూడా బడ్జెట్ లో ప్రాధాన్యం కల్పించిందని తెలిపారు. కాగా, రెండు రోజుల క్రితమే కేంద్రం ఈశాన్య రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో సాయుధ బలగాల ప్రత్యేక చట్టాలను ఎత్తివేసిన సంగతి తెలిసిందే.