మ‌క్కా మ‌సీదులోకి ఎంట‌ర్ అయిన నాన్‌-ముస్లీమ్.. సౌదీ పోలీసులు అల‌ర్ట్!

by Sumithra |   ( Updated:2023-10-10 11:03:35.0  )
మ‌క్కా మ‌సీదులోకి ఎంట‌ర్ అయిన నాన్‌-ముస్లీమ్.. సౌదీ పోలీసులు అల‌ర్ట్!
X

దిశ‌, వెబ్‌డెస్క్ః దైవానికి ఎవ్వ‌రూ అస్పృశ్యులు కాదు. స‌క‌ల జీవులు దేవుని సృష్టే అయిన‌ప్పుడు, ఎవ్వ‌రైనా దేవుణ్ని ఆశ్ర‌యించొచ్చు. అయితే, మ‌నిషి ఆచ‌రించే మ‌తం ఆయా సామాజిక, రాజ‌కీయ‌ ప‌రిస్థితుల‌ను బ‌ట్టి కొన్ని నియ‌మాల‌ను పెట్టుకోవ‌డం వ‌ల్ల, దానికి అనుగుణంగా అంద‌రూ న‌డుచుకోవాల్సి ఉంది. కానీ, దీన్ని అతిక్ర‌మించి ముస్లిముల‌కు పవిత్ర నగరమైన మక్కాలోకి ఓ ముస్లీమేత‌రుడు ప్రవేశించాడు. ఇప్పుడిదే సౌదీ పోలీసుల‌ను అల‌ర్ట్ చేసింది. ఇందులో, ముస్లీమేత‌రుడు రావ‌డానికి సహాయం చేసిన ఓ సౌదీ వ్య‌క్తిని అరెస్టు చేసినట్లు, పోలీసులు తెలిపారు. అయితే, ఈ విష‌యం బ‌య‌ట‌కు రావ‌డాన‌కి ఇజ్రాయెల్ జర్నలిస్టు త‌న యాత్ర గురించి ఆన్‌లైన్‌లో పెట్టిన వీడియోనే కావ‌డం విశేషం. ఈ వీడియోపై ఇంట‌ర్నెట్‌లో తీవ్ర వ్య‌తిరేక‌త రావ‌డంతో సౌదీ పోలీసులు రంగంలోకి దిగారు.

ఇజ్రాయెల్ ఛానెల్ 13కి చెందిన గిల్ తమరీ అనే జర్నలిస్ట్ సోమవారం నాడు ఈ వీడియోను టీవీ ఛాన‌ల్లో ప్ర‌సారం చేశారు. ముస్లిమేతరులపై నిషేధాన్ని ధిక్కరిస్తూ ఇస్లాం పవిత్ర నగరమైన మక్కాలోకి వెళ్లిన‌ ఈ వీడియోను ఆ త‌ర్వాత‌ ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. సౌదీ అధికారిక ప్రెస్ ఏజెన్సీ (SPA) ఆ జర్నలిస్టు పేరు చెప్పలేదు కానీ అతడు అమెరికన్ పౌరుడని, అతని కేసులో "అక్క‌డి చట్టాల ప్రకారం అతనిపై త‌గు చ‌ర్య‌లు తీసుకోవడానికి" ప్రాసిక్యూటర్‌లకు కూడా సూచించార‌ని పేర్కొన్నారు.

దాదాపు 10 నిమిషాల క్లిప్‌లో, తమరీ మౌంట్ అరాఫత్‌ను సందర్శిస్తాడు, అక్కడ ప్రతి సంవత్సరం హజ్ తీర్థయాత్ర క్లైమాక్స్ సమయంలో ప్రార్థన చేయడానికి ముస్లిం యాత్రికులు గుమిగూడి ఉండ‌టాన్ని చూపిస్తాడు. అయితే, అతను చేస్తున్నది చట్టవిరుద్ధమని తనకు తెలుసంటూ అందులోనే స్పష్టం చేయ‌డం విశేషం. కానీ, "మా ముస్లిం సోదరులు, సోదరీమణులకు చాలా ముఖ్యమైన స్థలాన్ని చూపించ‌డం కోస‌మే ఇలా చేస్తున్న‌ట్లు చెప్పాడు. తమరీ సమర్థన, తదుపరి క్షమాపణపై కోపంతో ఉన్న సౌదీ సోషల్ మీడియా తీవ్రంగా మండిప‌డింది. గత వారం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ విదేశీ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ఇజ్రాయెల్, సౌదీ అరేబియా రెండింటినీ సందర్శించిన త‌ర్వాత‌ ఈ వివాదం తలెత్తడం గ‌మ‌నార్హం.

Advertisement

Next Story

Most Viewed