ప్రజల సంక్షేమం కోసమే పనిచేయాలి.. పంజాబ్ సీఎం భగవంత్ మాన్

by Vinod kumar |
ప్రజల సంక్షేమం కోసమే పనిచేయాలి.. పంజాబ్ సీఎం భగవంత్ మాన్
X

ఛండీగఢ్: ప్రజల సంక్షేమం కోసం ఎమ్మెల్యేలు నిజాయితీగా పని చేయాలని పంజాబ్ సీఎం భగవంత్ మాన్ అన్నారు. మంత్రులు ఆకాంక్షలకు అనుగుణంగా నడుచుకోకపోతే తొలగించేలా ప్రజలు డిమాండ్ చేయవచ్చని తెలిపారు. ఈ మేరకు జాతీయ చీఫ్ కేజ్రివాల్‌తో కలిసి ఆదివారం కీలక ప్రకటన చేశారు. కాగా ముందస్తు ప్రకటనగా 25,000 ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు ప్రకటించారు. 'ఈ ఉద్యోగాలకు సంబంధించి చాలా మంది మిమ్మల్ని కలవచ్చు. ఎలాంటి రికమెండషన్లకు అస్కారం ఉండబోదు. ఆమ్ ఆద్మీ పార్టీలో అవినీతికి చోటు లేదు' అని అన్నారు.


పార్టీ చీఫ్ కేజ్రివాల్ పంజాబ్ ఆప్ ఎమ్మెల్యేలను ఉద్దేశించి మాట్లాడుతూ.. మూడు రోజుల్లోనే చాలా సమస్యలను కవర్ చేశారని తెలిపారు. పంజాబ్ తమ ప్రభుత్వం పని చేయడం ప్రారంభించిందని చెప్పారు. పంజాబ్ ప్రజలు ఎన్నుకున్న 92 మంది ఎమ్మెల్యేలు ఒక బృందంలా ఏర్పడి ప్రజల కోసమే పని చేస్తారని చెప్పారు. కాగా, ఈనెల 16న సీఎంగా భగవంత్ మాన్ ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలిసిందే.

Advertisement

Next Story