సీఎం ప్రమాణస్వీకారం.. బ్లాక్ మాస్క్, దుస్తులకు నో ఎంట్రీ

by Manoj |
సీఎం ప్రమాణస్వీకారం.. బ్లాక్ మాస్క్, దుస్తులకు నో ఎంట్రీ
X

పనాజి: గోవా ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వచ్చే వారికి బీజేపీ చీఫ్ సదానంద్ శెట్ తనవడే కీలక సూచనలు చేశారు. నలుపు రంగు మాస్కు, దుస్తులు ధరించిన వారికి లోనికి అనుమతించబోమని చెప్పారు. 'నలుపు మాస్కులు, వస్త్రాధారణ ఉన్న వారికి వేదిక లోపలికి అనుమతించబోం. అయితే అందరికీ అనుమతి ఉంది' అని తెలిపారు. సోమవారం ఉదయం డాక్టర్ శ్యాం ప్రసాద్ ముఖర్జీ స్టేడియంలో సీఎం ప్రమోద్ సావంత్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీతో పాటు కేంద్రమంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, ఇతర ముఖ్య నేతలు హజరు కానున్నారు.

Advertisement

Next Story