అతని వేధింపులు తట్టుకోలేకపోయా.. నటి ఎమోషనల్ కామెంట్స్

by sudharani |   ( Updated:2022-08-08 08:00:12.0  )
అతని వేధింపులు తట్టుకోలేకపోయా.. నటి ఎమోషనల్ కామెంట్స్
X

దిశ, సినిమా : బొద్దుగుమ్మ నిత్యామీనన్‌ అందరిలాగే తన లైఫ్‌లో కూడా చేదు అనుభవాలు ఉన్నాయని సెలవిస్తోంది. ఆమె విజయ్‌ సేతుపతితో కలిసి నటించిన మలయాళ చిత్రం '19(1)(ఏ)' ఇటీవలే విడుదలై హిట్‌టాక్‌తో దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నటి తన జీవితంలో జరిగిన ఒక భయంకరమైన సంఘటనను గుర్తు చేసుకుంది. సంతోష్‌ వర్గి అనే వ్యక్తి తనను ఆరేళ్ల పాటు రకరకాలుగా వేధింపులకు గురిచేశాడని, పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లు విష ప్రచారం చేసి ఇబ్బంది పెట్టాడంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఈ ఇష్యూపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఎంతోమంది చెప్పినప్పటికీ తాను మాత్రం అతన్ని క్షమించి వదిలేశానన్న నిత్య.. తన పేరెంట్స్ అతనికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్లు వెల్లడించింది. చివరగా తన గురించి ఎవరేమి చెప్పినా నమ్మొద్దని, ఏదైనా ఉంటే తానే స్వయంగా వెల్లడిస్తానని అభిమానులకు రిక్వెస్ట్ చేసింది.

నిత్యా మీనన్ అబద్దాలు చెప్తోంది.. పెళ్లి గురించి నేను వేధించలేదు : సంతోష్


Advertisement

Next Story