జైలులో సెలబ్రిటీ గేమ్.. ఫస్ట్ కంటెస్టెంట్‌గా నిషా

by Disha News Desk |
జైలులో సెలబ్రిటీ గేమ్.. ఫస్ట్ కంటెస్టెంట్‌గా నిషా
X

దిశ, సినిమా : కాంట్రవర్సీ కింగ్ కంగనా రనౌత్‌ హోస్ట్‌గా ఈ నెల 27న 'లాక్ అప్' రియాలిటీ షో ప్రారంభమవుతోంది. జైలులో బంధించబడిన 16 మంది సెలబ్రిటీల మధ్య 'ప్లే రియల్- విన్‌ రియల్‌' కాన్సెప్ట్‌తో 72 రోజుల పాటు నడిచే కార్యక్రమాన్ని ఏక్తాకపూర్‌, ఎంఎక్స్‌ ప్లేయర్‌ సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు. కాగా ఇందులో పాల్గొనబోయే మొదటి కంటెస్టెంట్ పేరు(నిషా రావల్)ను తాజాగా బయటపెట్టారు మేకర్స్. ఆమె చేతులకు బేడీలు వేసి లాకప్‌లో బంధించిన వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేస్తూ.. 'ఖైదీ నెంబర్ 1. నిషా రావల్ జీవితంలో అసలు రచ్చ ప్రారంభమవుతుంది. ఫిబ్రవరి 27 నుంచి ఎంఎక్స్‌ ప్లేయర్‌లో 'లాక్ అప్' లైవ్ స్ట్రీమింగ్ ఉచితంగా చూడండి' క్యాప్షన్ ఇచ్చారు.

కాగా ఈ షోలో పాల్గొనబోయే‌ కంటెస్టెంట్ల లిస్టులో.. ప్రియాంక్ శర్మ, వికాస్ గుప్తా, రోహ్మన్ షాల్, పూనమ్ పాండే, మునావర్ ఫరూఖీ తదితరుల పేర్లు ప్రచారంలో ఉన్నాయి. ఇదిలా ఉంటే 'లాక్ అప్' లాంచింగ్‌ ఈవెంట్‌లో మాట్లాడిన కంగన.. ఈ గేమ్‌లో కంటెస్టెంట్లు తమ కనీస అవసరాల కోసం కఠోరంగా శ్రమించాల్సి ఉంటుందని, తన బెస్ట్ ఫ్రెండ్ కరణ్ జోహార్‌, ఏక్తా కపూర్‌ను కూడా ఇదే జైలులో బంధించి ఆతిథ్యం ఇవ్వాలనుకుంటున్నానని చెప్పిన సంగతి తెలిసిందే.

https://twitter.com/altbalaji/status/1495647035831115778?s=20&t=VURzzL8husLhQIKeePPVMQ

Advertisement

Next Story