Telangana News: కలెక్టర్ ఆట కోసం 21 మంది వీఆర్‌ఏలు.. నవ్వులపాలవుతున్న తహశీల్దార్

by Manoj |   ( Updated:2022-04-13 11:57:01.0  )
Telangana News: కలెక్టర్ ఆట కోసం  21 మంది వీఆర్‌ఏలు.. నవ్వులపాలవుతున్న తహశీల్దార్
X

దిశ, వెబ్ డెస్క్: నిర్మల్ జిల్లాలో నవ్వులపాలవుతున్న తహశీల్దార్ తీరు. తహశీల్దార్ శివప్రసాద్ కలెక్టర్ టెన్నిస్ ఆట కోసం విచిత్ర ఆదేశాలు జారీ చేశారు.దీనికి సంబంధించి సోమవారం డీ/777/2020 నంబరుతో ప్రత్యేక ప్రొసీడింగ్‌ ఇచ్చారు. జిల్లాలోని 21 మంది వీఆర్‌ఏలను కలెక్టర్ ముసారప్ అలీకి సాయంగా ఉండాలని ప్రత్యేక ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వీరంతా రోజుకు ముగ్గురు చొప్పున బాల్స్ అందించాలంటూ ఆదేశాలు ఇచ్చాడు. అంతేకాకుండా వారి హాజరును పరిశీలించాలంటూ మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌కూ ఆయన ఆదేశాలు జారీ చేశారు. దీంతో స్థానికంగా వారిపై విమర్శలు వెల్లువెత్తున్నాయి.

Advertisement

Next Story