- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
స్త్రీ తన బలాన్ని నిరూపించుకునేందుకు జీవితం సరిపోవట్లేదు.. నిమ్రత్ కౌర్
దిశ, సినిమా: బీ టౌన్ నటి, 'ది లంచ్ బాక్స్' ఫేమ్ నిమ్రత్ కౌర్ స్త్రీల బలం, హక్కుల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం అభిషేక్ బచ్చన్ హీరోగా వస్తున్న 'దస్వి' సినిమాలో రాజకీయ నాయకురాలు 'గంగారామ్ చౌదరి' పాత్రలో కనిపించనున్న ఆమె.. మూవీ ప్రమోషన్‌లో భాగంగా పలు విషయాలపై మాట్లాడింది. 'ఈ చిత్రం విద్య ప్రాముఖ్యతను హైలైట్ చేస్తుంది. దీంతోపాటు మహిళా సాధికారత, సమాజంలో సమాన హోదా గురించి కూడా ఆలోచింపజేస్తుంది. పెద్దగా చదువుకోని, ఇంటికే పరిమితమైన ఓ స్త్రీ 'ముఖ్యమంత్రి'గా రాష్ట్రంలో తన సత్తా చాటుతోంది.
కానీ, ఒక రాష్ట్రాన్ని శాసించే అధికారంలో ఉన్న ఆమె.. తన భర్త ముందు ఎందుకు మాట్లాడలేకపోతుంది? కుటుంబానికి సంబంధించి సొంత నిర్ణయాలు ఎందుకు తీసుకోలేకపోతుంది? అనేది పెద్ద సమస్యగా మారింది' అంటూ ప్రశ్నించింది. అలాగే సమాజంలో మహిళలు తమకు తగిన స్థానాన్ని పొందలేకపోతున్నారన్న ఆమె.. మన సమాజంలో ఓ స్త్రీ తనను తాను నిరూపించుకోవడానికి జీవితాంతం కష్ట పడాల్సి వస్తుందని చెప్పింది. ఇక తుషార్ జలోటా దర్శకత్వం వహించిన 'దస్వీ' ఏప్రిల్ 7న 'నెట్‌ఫ్లిక్స్', 'జియో సినిమా'లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.