iPhoneకు పోటీగా అధునాతన ''Nothing Phone''

by Harish |
iPhoneకు పోటీగా అధునాతన Nothing Phone
X

దిశ,వెబ్‌డెస్క్: వన్‌ప్లస్ సహ వ్యవస్థాపకుడు కార్ల్ పీ కొత్త కంపెనీ నథింగ్.. ఈ వేసవిలో సరికొత్త 'నథింగ్ ఫోన్ (1)'ను తీసుకురానుంది. ఇంతకుముందు జరిగిన ఈవెంట్‌లో స్మార్ట్‌ఫోన్ క్వాల్‌కామ్ ప్రాసెసర్‌తో వస్తుందని కంపెనీ తెలిపింది. అలాగే ప్రెజెంటేషన్ సందర్భంగా నథింగ్ ఫోన్ (1) ఆపిల్ ఐఫోన్‌కు ప్రత్యామ్నాయంగా వస్తుందని తెలిపారు. కంపెనీ ఖచ్చితమైన లాంచ్ టైమ్‌లైన్ చెప్పనప్పటికి, " 2022 వేసవి"లో స్మార్ట్‌ఫోన్ లాంచ్ కానుంది. ఇ-కామర్స్ వెబ్‌సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో ఫోన్ గురించి "కమింగ్ సూన్" అని ఇవ్వబడింది. నథింగ్ స్మార్ట్‌ఫోన్ లాంచ్ గురించి ముందుగా తెలుసుకోవాలనుకునేవారికి ఫ్లిప్‌కార్ట్ నథింగ్ ఫోన్ (1) లిస్టింగ్‌లో "అలెర్ట్ మి" ఆప్షన్‌ను ఇచ్చింది. ధర విషయానికి వస్తే ఈ స్మార్ట్ ఫోన్, Apple iPhone తో పోటీ పడాలని చూస్తోంది, కాబట్టి ధర కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. స్మార్ట్‌ఫోన్ ప్రత్యేకమైన నథింగ్ ఓఎస్‌తో పనిచేస్తుంది. ఈ సాఫ్ట్‌వేర్ వేగవంతంగా ఉంటుందని అలాగే సెక్యూరిటీ పరంగా అధునాతనమైనదని కంపెనీ తెలిపింది. నథింగ్ స్మార్ట్ ఫోన్ Google తాజా Android 12 OS తో వస్తుంది.



Advertisement

Next Story