- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఫ్లాష్..ఫ్లాష్.. రష్యా డిమాండ్లకు ఉక్రెయిన్ అంగీకారం
కీవ్: టర్కీ వేదికగా ఉక్రెయిన్, రష్యా రాయబారుల మధ్య జరిగిన చర్చలు ఫలప్రదంగా ముగిశాయి. ఇస్తాంబుల్ వేదికగా జరిగిన సమావేశాల్లో రష్యా ప్రధాన డిమాండ్‌గా ఉన్న తటస్థ వైఖరికి ఉక్రెయిన్ అంగీకరించింది. 'ఉక్రెయిన్ తటస్థంగా ఉంటుంది. అంతేకాకుండా నాటోలో చేరదు. కానీ, భద్రతాపరమైన గ్యారంటీలు ఇవ్వాల్సి ఉంటుంది. అలా చేస్తే ఏ సైనిక కూటమిలోనూ చేరబోము' అని ఉక్రెనియన్ రాయబారి ఒలెక్సాండర్ చాలీ అన్నారు. అంతేకాకుండా విదేశీ మిలిటరీ స్థావరాలకు కూడా చోటివ్వమని చెప్పారు. అంతకుముందు.. సమావేశంలో పాల్గొనే ప్రతినిధులను ఏమి తినవద్దు, తాగవద్దని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి దిమిత్రో కులేబా సూచించారు. గతంలో జరిగిన సమావేశాల్లో విషప్రయోగం జరిగాయన్న ఆరోపణలతో ఆయన తాజా సూచనలు చేశారు.
ఉక్రెయిన్ సైనిక సామర్థ్యం దిగజారింది
రష్యా రక్షణ మంత్రి సెర్గీ షోయిగు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్ సైన్యం సామర్ధ్యం తీవ్రంగా దిగజారిపోయిందని అన్నారు. మంగళవారం ఉన్నతాధికారులతో టెలివిజన్ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రష్యా ప్రత్యేక మిలటరీ ఆపరేషన్ మొదటి దశ పూర్తయిందని చెప్పారు. ఉక్రెయిన్ కు వాయు రక్షణ వ్యవస్థలను నాటో సరఫరా చేస్తే తగిన ప్రతిస్పందన ఉంటుందని ఆయన హెచ్చరించారు. ఇక రష్యా దాడుల్లో 600 మంది విదేశీ సైనికులు చనిపోయారని చెప్పారు.
మైఖోలైవ్‌లో ఏడుగురు మృతి
పోర్ట్ సిటీలో మైఖోలైవ్ లో రష్యా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. మంగళవారం ప్రాంతీయ ప్రభుత్వ కార్యాలయాలపై జరిపిన దాడుల్లో ఏడుగురు మరణించినట్లు అధికారులు తెలిపారు. అంతేకాకుండా మరో 22 మంది గాయపడినట్లు చెప్పారు.