నటి 'బ్రా' పై కన్నేసిన నెటిజన్లు.. ఎక్కడ చూడమంటావని కామెంట్స్

by Disha Desk |
నటి బ్రా పై కన్నేసిన నెటిజన్లు.. ఎక్కడ చూడమంటావని కామెంట్స్
X

దిశ, సినిమా: మోడల్‌గా కెరీర్‌ ఆరంభించి అందం, అభినయంతో అనతికాలంలోనే స్టార్‌గా ఎదిగిన నటి ఊర్వశి రౌతేలా. 2013 లో రిలీజైన 'సింగ్ సాబ్ ది గ్రేట్' మూవీతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ హరిద్వార్‌ ముద్దుగుమ్మ.. యూనిక్ అవుట్‌ఫిట్స్, బోల్డ్ పిక్స్‌తో సోషల్ మీడియాలోనూ భారీ ఫాలోయింగ్ పెంచుకుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో 45.5 మిలియన్ ఫాలోవర్స్‌ను సొంతం చేసుకున్న ఈ అమ్మడు తాజాగా ఓ పెయింటింగ్ వేసి నెటిజన్లను సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది.

గతంలోనూ ఎన్నో పెయింటింగ్స్ వేసిన నటి.. ప్రస్తుతం బేబీ కటింగ్‌తో కనిపిస్తున్న అమ్మాయి బొమ్మను అద్భుతంగా గీసి 'మీరు నన్ను ఎక్కడ కనుగొంటారు' క్యాప్షన్‌తో నెట్టింట పోస్ట్ చేసింది. కొంతమంది ఈ చిత్రంపై ప్రశంసలు కురిపిస్తుంటే.. మరికొందరు మాత్రం ఊర్వశి పెయింటింగ్ వేస్తున్నప్పుడు ధరించిన డ్రెస్‌పై కన్నేశారు. ఆమె బాడీ మొత్తాన్ని కవర్ చేసిన ఆ డ్రెస్.. వీపు భాగంలో మాత్రం బ్రా కనిపించేలా డిజైన్ చేయబడింది. ఇదే విషయాన్ని పాయింట్‌అవుట్ చేసిన నెటిజన్లు.. 'నీ బ్రా చూపిస్తున్నావా? లేక ఆర్ట్ చూపిస్తున్నావా? ఇంతకీ ఎక్కడ చూడమంటావ్..' అని కామెంట్ చేస్తున్నారు.

Advertisement

Next Story