రాయల్ లుక్‌లో మెరిసిన Rocking Star భార్య.. ఇది కదా అసలైన అప్సరస అందం అంటున్న నెటిజన్లు

by Kavitha |
రాయల్ లుక్‌లో మెరిసిన Rocking Star భార్య.. ఇది కదా అసలైన అప్సరస అందం అంటున్న నెటిజన్లు
X

దిశ, సినిమా: రాకింగ్ స్టార్ యష్(Rocking Star Yash) భార్య అయినటువంటి రాధిక పండిట్(Radhika Pandit) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ అమ్మడు పెళ్లికి ముందు కన్నడ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ అన్న సంగతి తెలిసిందే. అప్పట్లో ఎన్నో సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ క్రియేట్ చేసుకుంది. ఆ తర్వాత కన్నడ స్టార్ హీరో అయినటువంటి యష్‌ను ప్రేమించి 2016లో పెళ్లి చేసుకుంది. ఇక మ్యారేజ్ తర్వాత సినిమాలకు కొంత గ్యాప్ ఇచ్చిన ఈ బ్యూటీ.. పిల్లలు పుట్టాక పూర్తిగా సినిమాలకు గుడ్ బై చెప్పేసింది. అయితే ఈ ఇప్పటికీ ఈ ముద్దుగుమ్మ అభిమానులు ఈమె మూవీలు చేయాలని కోరుకుంటున్నారు. బట్ ఈ భామ మాత్రం వాటిపై ఇంట్రెస్ట్ లేనట్లుగా కనిపిస్తోంది.

కాకపోతో ఈ అమ్మడు నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ లేటెస్ట్ ఫొటోలు, వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ ఫ్యాన్స్‌కు దగ్గరవుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఈ భామ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాజాగా రాధిక పండిట్ తన ఇన్‌స్టా(Instagram) వేదికగా కొన్ని ఫొటోలు షేర్ చేసింది. అందులో వైట్ లంగావోణి కట్టుకొని రాయల్ లుక్‌లో రెడీ అయి ఫొటోలకు పోజులిచ్చింది. అంతేకాక ‘తెల్లటి గుసగుసలు, ప్రశాంతత మైన క్షణాలు, ఇక్కడ ఆలోచనలు తమ ఇంటిని కనుగొంటాయి’ అనే క్యాప్షన్ కూడా జోడించింది. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక వాటిని చూసిన నెటిజన్లు ‘ఇది కదా అసలైన అప్సరస అందం అంటే’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి మీరు వాటిపై ఓ లుక్ వేసేయండి.

(video link credits to Radhika Pandit instagram id)

Advertisement

Next Story