- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నెట్‌ఫ్లిక్స్‌లో కాస్ట్ ప్లాన్స్.?
దిశ, ఫీచర్స్ : ఓటీటీ స్ట్రీమింగ్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ గతేడాదిలో దాదాపు 2 లక్షల మంది ఫాలోవర్లను కోల్పోయిందని ఓ నివేదిక వెల్లడించింది. కాగా అప్పటి నుంచి మార్కెట్ దృష్టిని ఆకర్షించేందుకు తీవ్రంగా కృషి చేస్తున్న ఈ స్ట్రీమింగ్ ప్లాట్‌పామ్, సమీప భవిష్యత్తులో మరింత పొదుపుగా, తక్కువ ఖర్చుతో కూడిన ప్లాన్స్ అందించడానికి ప్రణాళికలు వేస్తోందని ఇటీవల పేర్కొంది.
పాండమిక్ టైమ్ నుంచి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఈ క్రమంలోనే తక్కువ ధరలున్న ఓటీటీలనే యూజర్స్ ఎంచుకుంటున్నారు. దీంతో మిగతా స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్‌తో చూసుకంటే నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్కిప్షన్ రేట్లు కాస్త ఎక్కువగా ఉండటం వల్ల చాలా మంది కస్టమర్స్‌ను కోల్పోవడానికి నిస్సందేహంగా ప్రాథమిక కారణంగా నిలిచింది. నిజానికి యాడ్ ఫ్రీ ప్లాన్లను భరించడానికి సిద్ధంగా ఉన్నారు కానీ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌లు తక్కువగా ఉండాలని భావిస్తున్నారు.
అంతేకాదు నెట్‌ఫ్లిక్స్ పాస్‌వర్డ్ షేరింగ్ సమస్యల గురించి కూడా ఆందోళన చెందిన యూజర్స్, దీని నుంచి అన్‌సబ్‌స్క్రైబ్ అయ్యారు. దీంతో నెట్‌ఫ్లిక్స్ ఇప్పుడు యాడ్-సపోర్టెడ్ చౌకైన ప్లాన్‌లను తీసుకోచ్చేందుకు ప్లాన్ చేస్తోంది. ఈ మేరకు కేన్స్ లయన్స్ అడ్వర్టైజింగ్ కాన్ఫరెన్స్‌లోని ఇంటర్వ్యూలో యాడ్-సపోర్టెడ్ టైర్‌ను ప్రారంభించాలనే కంపెనీ ప్రణాళికలను నెట్‌ఫ్లిక్స్ సీఈవో సరండోస్ చర్చించినట్లు తెలుస్తోంది. ఈ సంవత్సరం చివరిలోపు ప్రణాళికలను ప్రారంభించాలని కార్పొరేషన్ భావిస్తున్నట్లు న్యూయార్క్ టైమ్స్ ఇంతకు ముందే నివేదించింది.
నిజానికి ఇండియాలో తక్కువ లో-కాస్ట్ యాడ్ సపోర్టెడ్ సర్వీస్ అందించే అనేక Netflix ప్రత్యామ్నాయాలు (Zee5, Disney+ Hotstar, Voot, MX Player) అందుబాటులోకి వచ్చాయి. మరి ఈ ప్లాన్స్ నెట్‌ఫ్లిక్స్‌కు ఎంతవరకు కస్టమర్స్‌ను ఆకట్టుకుంటాయో వేచిచూడాలి.