Netflix నుంచి 'Two Thumbs Up' ఫీచర్‌

by Harish |
Netflix నుంచి Two Thumbs Up ఫీచర్‌
X

దిశ, వెబ్‌డెస్క్: నెట్‌ఫ్లిక్స్ తన వినియోగదారుల కోసం 'టూ థంబ్స్ అప్' అనే కొత్త ఫీచర్‌ను ప్రారంభించింది. ఈ కొత్త ఫీచర్ ద్వారా ఏదైనా సిరీస్/సినిమాల గురించి అభిప్రాయాన్ని(ఫీడ్‌బ్యాక్) తెలియజేయవచ్చు. వీడియో కింద 'Two Thumbs Up,' 'I Like it,' 'Download,' 'Not For Me,' others అనే ఆప్షన్స్ ఉంటాయి. వీటి ద్వారా వినియోగదారులు వారికి నచ్చిన అభిప్రాయాన్ని ఇవ్వవచ్చు. ఈ కొత్త Like it, Dislike ఫీచర్‌ వెబ్, టీవీ, iOS, ఆండ్రాయిడ్ మొబైల్ డివైజ్‌లలో అందుబాటులో ఉంది.



" Thumbs Up, Thumbs Down బటన్‌లు సిరీస్ లేదా సినిమా గురించి ఎలా అనిపిస్తుందో తెలియజేయడానికి మంచి మార్గం, బదులుగా అభిరుచికి అనుగుణంగా ప్రొఫైల్‌ను పొందుతారని" Netflix ఒక ప్రకటనలో తెలిపింది. ఆండ్రాయిడ్ ఫోన్‌లో, ఈ ఫీచర్‌ను యాక్సెస్ చేయడానికి సంబంధిత టైటిల్‌పై నొక్కి ఆపై టైటిల్ పేరుతో ఉన్న మూడు చుక్కలపై క్లిక్ చేయాలి. తర్వాత Two Thumbs Up,' 'I Like it,' 'Download,' 'Not For Me,' and others సహా ఎంపికలు కనిపిస్తాయి. వీటిని ఎంచుకొవడం ద్వారా వినియోగదారలు తమ ఫీడ్‌బ్యాక్ ఇవ్వవచ్చు. ఇంతకుముందు నెట్‌ఫ్లిక్స్ స్టార్-బేస్డ్ ఫీడ్‌బ్యాక్ సిస్టమ్‌ను కలిగి ఉంది. ఐదు నక్షత్రాల ద్వారా కంటెంట్‌కు రేటింగ్ ఇవ్వడానికి వీక్షకులను అనుమతించింది. నెట్‌ఫ్లిక్స్ మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా థంబ్స్-అప్/ థంబ్స్-డౌన్ తరవాత డబుల్-థంబ్స్ అప్‌ ఆప్షన్‌ను ఇచ్చింది.

Advertisement

Next Story

Most Viewed