కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసిన ఎంపీ.. దానిపై ఏం చర్యలు తీసుకున్నారని?

by Vinod kumar |
కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసిన ఎంపీ.. దానిపై ఏం చర్యలు తీసుకున్నారని?
X

దిశ, ఏపీ బ్యూరో: నెల్లూరు నగరం, శివార్లలో కేంద్ర ప్రభుత్వం ఎన్ని ఫ్లైఓవర్ బ్రిడ్జిలను నిర్మించాలని యోచిస్తోందని నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి బుధవారం పార్లమెంట్‌లో ప్రశ్నించారు. దానికోసం ఎంత మొత్తాన్ని కేటాయించారో చెప్పాలని ప్రశ్నించారు. దీనికి కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ లిఖితపూర్వకంగా సమాధానం చెప్పారు. నెల్లూరు నగరంలో నాలుగు లెవెల్ క్రాసింగ్‌లు 112, 113, 117, 118 ఉన్నాయని చెప్పుకొచ్చారు. ఇందులో 112, 113 బదులుగా 2 ఓవర్ బ్రిడ్జిలు భాగస్వామ్య ప్రాతిపదికన నిర్మించేందుకు రూ.47.11కోట్లు, రూ.46.36 కోట్లు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు.


117, 118 లెవెల్ క్రాసింగ్‌లు నెల్లూరు రైల్వే స్టేషన్ యార్డులో ఉన్నాయని, ఇక్కడ రైల్వే ఓవర్ బ్రిడ్జి, అండర్ బ్రిడ్జిల నిర్మాణానికి భాగస్వామ్య ప్రాతిపదికన అర్హత పొందాయని తెలిపారు. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇంత వరకూ ఎటువంటి ప్రతిపాదన అందలేదని వెల్లడించారు. నెల్లూరు జిల్లాలో 55 లెవెల్ క్రాసింగ్(ఎల్.సి) అందుబాటులో ఉంటే అందులో 15 ఎల్.సి ల వద్ద రోడ్డు ఓవర్ బ్రిడ్జిలు, రోడ్ అండర్ బ్రిడ్జిలు మంజూరైనట్లు కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed