- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేసీఆర్ పర్యటన విజయవంతం చేయాలి.. మంత్రి నిరంజన్ రెడ్డి
దిశ, వనపర్తి : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లా పర్యటనను విజయవంతం చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి.. Latest Telugu News..తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లా పర్యటనను విజయవంతం చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పిలుపునిచ్చారు. మంత్రి నిరంజన్ రెడ్డి పార్టీ కార్యకర్తలు, నేతలు, ప్రజా ప్రతినిధులతో మంగళవారం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. మార్చి 8న కేసీఆర్ జిల్లా పర్యటన విజయవంతం చేసేందుకు రాష్ట్ర మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ జిల్లా పర్యటనలో భాగంగా రాష్ట్రంలో రూ.7,289 కోట్ల వ్యయంతో మన ఊరు మనబడికి పథకానికి వనపర్తి నుండే శ్రీకారం చుట్టానున్నారని తెలిపారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో గత ఏడేళ్లలో వందేళ్ల అభివృద్ధిని చేశామని, జిల్లాకు మెడికల్, ఇంజనీరింగ్ కళాశాల, నర్సింగ్ కళాశాల, మత్స్య కళాశాలలను తీసుకోరావడం, దాదాపు 2.70 లక్షల ఎకరాలకు సాగునీరు అందించి జిల్లాను సస్యశ్యామలం చేశామన్నారు.
సీఎం కేసీఆర్ కర్నె తండా ఎత్తిపోతలకు శంకుస్థాపన, చిట్యాల నూతన వ్యవసాయ మార్కెట్ యార్డు, నూతన కలెక్టరేట్ భవన సముదాయం, టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభిస్తారని తెలిపారు. 1.5 లక్షల మందితో నిర్వహించ తలపెట్టిన బహిరంగ సభను విజయవంతం చేసేందుకు కార్యకర్తలు, నేతలు, ప్రజా ప్రతినిధులు మండలాలు, గ్రామాల్లో పర్యటించి సభకు ప్రజలను సన్నద్దం చేయాలన్నారు. అంతేకాకుండా మంత్రి నిరంజన్ రెడ్డి రాష్ట్ర ప్రజలందరికీ మహా శివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు.