Game Changer:  ‘గేమ్ ఛేంజర్’ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన నవీన్ చంద్ర

by Prasanna |   ( Updated:2024-10-21 14:58:35.0  )
Game Changer:  ‘గేమ్ ఛేంజర్’ పై  ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన నవీన్ చంద్ర
X

దిశ, వెబ్ డెస్క్ : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా ‘గేమ్ ఛేంజర్’. ఈ మూవీ కోసం ప్రేక్షకులతో పాటు సినీ ఇండస్ట్రీ ఎదురుచూస్తుంది. మూడేళ్ళ నుంచి ఎలాంటి అప్డేట్స్ ఇవ్వకుండా ఇప్పుడు మేకర్స్ వరుస అప్డేట్స్ ఇస్తున్నారు. దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ మూవీ ప్రస్తుతం, పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది.

అయితే, తాజాగా ఈ మూవీలో నటిస్తున్న నవీన్ చంద్ర షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో నవీన్ చంద్ర మాట్లాడుతూ.." గేమ్ ఛేంజర్ కోసం ఎవరైతే వేచి చూస్తున్నారో వారు రాసి పెట్టుకోండి.. ఇప్పుడున్న హైప్ ఒక హైపే కాదు, అతి త్వరలో మంచి అప్డేట్స్ వస్తాయి. ఇప్పటి నుండి జనవరి వరకు వెయిట్ చెయ్యండి, మీరు ఊహించలేని సర్ప్రైజ్ లు వస్తాయి. దీపావళికి టీజర్ కూడా రాబోతుంది, పోస్ట్ ప్రొడక్షన్ తర్వాత సినిమా నిర్మాత దిల్ రాజు ఇచ్చే అప్డేట్స్ వేరే లెవెల్ అంటూ" నవీన్ చంద్ర తన మాటల్లో చెప్పుకొచ్చాడు.

ఇటీవలే ఈ మూవీ విడుదల డేట్ ను అధికారికంగా ప్రకటించారు. వచ్చే సంక్రాంతికి జనవరి 10న ఈ మూవీ భారీగా విడుదల కానుంది. ఈ మూవీలో SJ సూర్య విలన్ గా, కియారా అద్వానీ, సునీల్, శ్రీకాంత్, అంజలి, విశ్వంత్.. పలువురు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Advertisement

Next Story