పాపం నాని.. మళ్లీ అదే తప్పు చేస్తున్నాడు..

by S Gopi |
పాపం నాని.. మళ్లీ అదే తప్పు చేస్తున్నాడు..
X

దిశ, సినిమా: నేచురల్ స్టార్ నాని 'జెర్సీ, గ్యాంగ్ లీడర్, శ్యామ్ సింగరాయ్, అంటే సుందరానికీ'.. ఇలా వరుసగా వచ్చిన సినిమాలన్నీ పాజిటివ్ రివ్యూ సంపాదించుకున్నాయి. కానీ రిలీజింగ్ డేట్ సరిగ్గా నిర్ణయించకపోవడంతో బాక్సాఫీసు వసూళ్లలో వెనకబడిపోతున్నాయి. 'శ్యామ్ సింగరాయ్'.. అఖండ, పుష్ప చిత్రాల మధ్య నలిగిపోతే... 'అంటే సుందరానికీ' సర్కారువారి పాట, విక్రమ్, మేజర్ చిత్రాల ధాటిని తట్టుకుని నిలబడలేకపోయింది. ఇక తన అప్ కమింగ్ మూవీ 'దసరా' విషయంలోనూ ఈ తప్పు జరుగుతోందని విశ్లేషకులు హింట్ ఇస్తున్నారు. 'దసరా' మూవీ రిలీజ్ టైమ్‌లోనే బాలయ్య 107వ చిత్రం, చిరు 'గాడ్ ఫాదర్' విడుదల కానున్నాయని సమాచారం. చిరు, బాలయ్యను తట్టుకుని నిలబడం కష్టమే కాగా.. రిలీజ్ డేట్ మారిస్తే బాగుంటుందని సూచిస్తున్నారు.

Advertisement

Next Story