నిరీక్షణ ముగుస్తుంది.. ‘పుష్ప-2’ ట్రైలర్‌పై బిగ్గెస్ట్ అప్‌డేట్ ఇచ్చిన మైత్రీ మూవీ మేకర్స్

by sudharani |
నిరీక్షణ ముగుస్తుంది.. ‘పుష్ప-2’ ట్రైలర్‌పై బిగ్గెస్ట్ అప్‌డేట్ ఇచ్చిన మైత్రీ మూవీ మేకర్స్
X

దిశ, సినిమా: ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేమికులు ఎంతో ఈగర్‌గా ఎదురుచూస్తున్న చిత్రం ‘పుష్ప-2’ (Pushpa-2). ‘పుష్ప: ది రైజ్’ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో.. దీనికి సీక్వెల్‌గా వస్తున్న ‘పుష్ప-2’ భారీ ఎక్స్‌పెక్టేషన్స్ (expectations) ఉన్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ (Mythry Movie Makers) అసోసియేషన్ విత్ సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్‌పై నవీన్ ఎర్నీని, వై. రవిశంకర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని సుకుమార్ (Sukumar) దర్శకత్వం వహిస్తుండగా.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా, నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika Mandanna) హీరోయిన్‌గా నటిస్తుంది. భారీ అంచనాల మధ్య ఈ పాన్ ఇండియా మూవీ డిసెంబర్-5న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉండగా.. అప్‌డేట్స్ కోసం ఎంతో ఈగర్‌గా ఎదురు చూస్తున్నారు అభిమానులు.

ఈ క్రమంలోనే గత కొన్ని రోజులుగా ట్రైలర్‌పై అప్‌డేట్స్ ఇస్తూనే ఉన్నారు కానీ, ట్రైలర్ (Trailer) మాత్రం రిలీజ్ చెయ్యడం లేదు. ఇందులో భాగంగా ఇప్పుడు మరోసారి ట్రైలర్ అప్‌డేట్ (Update) ఇచ్చింది మైత్రీ మూవీ మేకర్స్ (makers). ఈ మేరకు.. ‘నిరీక్షణ ముగుస్తుంది! రూల్ తీసుకుంటుంది. అతిపెద్ద భారతీయ చిత్రం యొక్క ట్రైలర్ లాక్ చేయబడింది. #పుష్ప2ట్రైలర్ అనౌన్స్‌మెంట్ రాబోతుంది’ అంటూ చెప్పుకొచ్చారు. నిరీక్షణ ముగుస్తుంది అంటూ మైత్రీ మూవీ మేకర్స్ ట్వీట్ పెట్టడంతో.. ట్రైలర్ వచ్చే సమయం అసన్నమైందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు అభిమానులు.

Advertisement

Next Story