- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చిలీలో భూమిని మింగేస్తున్న మిస్టీరియస్ సింక్ హోల్
దిశ, ఫీచర్స్ : ఉత్తర చిలీలోని టియెర్రా అమరిల్లా కమ్యూన్‌లో 25 మీటర్ల(82 అడుగులు) వెడల్పు, 200 మీటర్ల(656 అడుగులు) లోతున ఉన్న ఒక రహస్య సింక్‌హోల్ పరిశోధకులను అబ్బురపరిచింది. కేటర్ అటాకామా ప్రాంతంలోని విస్తారమైన భూభాగంలో గల ఈ సింక్‌హోల్ నిరంతరం పెరుగుతూనే ఉంది. దీనిని నేషనల్ సర్వీస్ ఆఫ్ జియాలజీ అండ్ మైనింగ్ (సెర్నాజియోమిన్) డ్రోన్‌ల ద్వారా పరిశీలించిన పరిశోధకులు 82 అడుగుల భారీ వ్యాసాన్ని కలిగి ఉందని తేల్చారు. 'ఇది దాదాపు 200 మీటర్ల లోతున ఉంది. మేము అక్కడ ఎటువంటి మెటీరియల్స్ గుర్తించలేదు. కానీ చాలావరకు నీటి ఉనికిని గుర్తించాం' అని సెర్నాజియోమిన్ డైరెక్టర్ డేవిడ్ మోంటెనెగ్రో చెప్పారు.
సాధారణంగా భూగర్భంలో జరిగే మార్పుల వల్ల ఇలాంటి సింక్‌హోల్స్ ఏర్పడతాయి. కాగా, ఈ సింక్ హోల్ సమీపంలోనే ఉన్న కెనడియన్ కంపెనీ(లుండిన్ మైనింగ్)కి సంబంధించి గని ప్రవేశాన్ని అధికారులు మూసివేశారు. అంతేకాదు ఈ ప్రాంతం స్థిరంగా ఉందని, తమ మౌలిక సదుపాయాలపై ఎలాంటి ప్రభావాలు చూపలేదని కంపెనీ పేర్కొంది. ఇక ఈ ప్రాంతంలో ఎటువంటి ప్రాణనష్టం కలగనప్పటికీ.. మైనింగ్ నిక్షేపాల కోసం భూగర్భ పనులు విస్తారంగా జరుగుతున్నందునే ఇక్కడ సింక్‌హోల్స్ ఏర్పడుతున్నాయని అధికారులు స్పష్టం చేశారు.