- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
డిప్యూటీ మేయర్ అపార్ట్ మెంట్‌లో జరిగింది మర్డరే
దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ డిప్యూటి మేయర్ ఇద్రిస్ ఖాన్‌కు సంబందించి నూతనంగా నిర్మిస్తున్న అపార్ట్ మెంట్‌లో ఇటివల జరిగిన వ్యక్తి అనుమానస్పధ మృతి కాదని మర్డర్ అని పోలీసులు తేల్చి చెప్పారు. ఈ కేసులో వ్యక్తిని కొట్టి చంపిన ముగ్గురిని అరెస్టు చేసినట్లు నిజామాబాద్ ఎసీపీ వేంకటేశ్వర్ తెలిపారు. శనివారం ఎసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. పోలీసుల కథనం ప్రకారం..ఈ నెల 9న నగరంలోని వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బోదన్ రోడ్డులో డిప్యూటి మేయర్ ఇద్రిస్ ఖాన్ అపార్ట్ మెంట్‌లో సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఖిల్లారోడ్డులోని మహ్మదియ కాలనీకి చెందిన షెక్ కైసర్‌ను అక్కడ పనిచేస్తున్న మహరాష్ర్టలోని గుండియా జిల్లాలోని వేర్వేరు ప్రాంతాలకు చెందిన రాజేష్ కోహ్రే, రవింధ్ర కావ్రే, జితేంధర్ కుమార్ వార్‌లు కర్రలతో చితకబాదారు. షేక్ కైసర్ తలపై కర్రలతో కొట్టడంతో అతను అక్కడికక్కడే మరణించాడు. నిందితులు ముగ్గురు కలిసి మృతదేహాన్ని మెట్ల వద్ద వేసి వెళ్ళిపోయారు.
సూపర్‌వైజర్ పిర్యాదుతో నిజామాబాద్ వన్‌టౌన్ ఎస్ హెచ్ ఓ డి విజయ్ బాబు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి విచారణ జరిపారు. పోస్టుమార్టంలో షేక్ కైసర్ కొట్టిన దెబ్బలకు చనిపోయినట్టు ప్రాథమిక రిపోర్టు వచ్చింది. స్థానికంగా అక్కడ ఉన్న సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా ఆరోజు అక్కడ పనిచేసే నలుగురిపై అనుమానంతో శనివారం రాజేష్ కోహ్రే, రవింధ్ర కావ్రే, జితేంధర్ కుమార్ వర్‌లను అదుపులోకి తీసుకోని విచారణ జరుపడంతో తామే కైసర్‌ను అవేశంలో కర్రలతో కోట్టడంతో చనిపోయినట్లు అంగీకరించారు. తాము పనిచేస్తున్న అపార్ట్ మెంట్‌లో ఇదివరకు 15 వరకు సెల్ ఫోన్ లు చోరి అయ్యాయన్నారు. కైసర్ కూడా చోరికి వచ్చాడని భావించి కొట్టడంతో తలగ రాని చోట తగిలి అతను చనిపోయాడని వారు అంగీకరించడంతో ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. మూడు రోజుల వ్యవధిలో మర్డర్ కేసును చెదించిన ఎస్‌హెచ్ఓ విజయ్ బాబును, ఎస్ఐ నర్సింలు సిబ్బందిని ఎసీపీ వేంకటేశ్వర్ అభినంధించారు.