ఉదయ్ కిరణ్ గురించి సంచలన విషయాలు బయపెట్టిన మురళీ మోహన్

by GSrikanth |
ఉదయ్ కిరణ్ గురించి సంచలన విషయాలు బయపెట్టిన మురళీ మోహన్
X

దిశ, వెబ్‌డెస్క్: ఆనాటి లవర్‌బాయ్ ఉదయ్ కిరణ్ అందరికి గుర్తుండే ఉంటాడు. కెరియర్‌లో ఒడిదుడుకులను భరించలేని ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకుని కన్ను మూసిన విషయం తెలిసిందే. అయితే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మురళీ మోహన్ ఉదయ్ గురించి కొన్ని విషయాలు పంచుకున్నారు. ''మహేశ్ బాబు నటించి.. సూపర్ హిట్ అయిన 'అతడు' సినిమా మురళీమోహన్ సంస్థలైన జయభేరి ఆర్ట్స్ నిర్మించింది. ఈ సినిమా అప్పట్లో యువతకు ఎంతగానో నచ్చింది. అంతేకాదు రికార్డులను సైతం బద్దలకొట్టింది. అయితే మురళీమోహన్ చెప్పిన విషయం ప్రకారం ఈ సినిమా కోసం వరుస విజయాలతో దూసుకుపోతున్న ఉదయ్ కిరణ్‌ని హీరోగా చేయాలని మురళీ మోహన్ భావించారట. ఆ విషయం చెప్పగానే ఉదయ్ కూడా చేస్తానని మాట ఇచ్చాడట.

అయితే స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేయడానికి కొంత సమయం పట్టింది. ఈ లోగా ఉదయ్ కిరణ్‌కి చిరంజీవి కుమార్తె సుష్మితతో వివాహం నిశ్చయమైంది. వివాహం కుదిరిన వెంటనే ఉదయ్‌కి సంబంధించిన అన్ని వ్యవహారాలు అరవింద్ దగ్గరుండి చూసుకున్నాడని చివరకు అతడు డేట్‌కి సంబంధించిన డైరీని కూడా అరవింద్ దగ్గరే పెట్టుకున్నాడంటా. అంతేకాకుండా ఎవరికి ఏ సినిమా ఒప్పుకోవాలి, ఎవరితో సినిమా చేయాలి ఎన్ని డేట్స్ ఇవ్వాలి అన్నీ వ్యవహారాలు అరవింద్ పర్యవేక్షణలోనే జరిగేవని మురళీమోహన్ ఈ ఇంటర్వ్యూలో తెలియజేశాడు. స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసుకున్న తర్వాత ఉదయ్ దగ్గరకు వెళితే మొదట సినిమా చేస్తానని ఒప్పకున్న తాను.. అరవింద్ డేట్స్ లేవని చెప్పగానే ఉదయ్ కూడా ఏం మాట్లాడలేక పోయాడు. దీంతో ఉదయ్ చేయాల్సిన అతడు సినిమా మహేశ్ బాబుకి వెళ్లిందంటూ సంచలన విషయాలు బయటపెట్టాడు మురళీ మోహన్. ఆ తర్వాత సుష్మితతో వివాహం క్యాన్సిల్ కావడంతో అతడు ముందు ఒప్పుకున్న సినిమాలన్ని ఏ కారణం చేతనో తన నుండి వెళ్లిపోయాయి. తర్వాత కెరీర్‌లో వెనకపడిపోవడం, సూసైడ్ చేసుకోవడం, చనిపోవడం ఇదంతా మనందరికి తెలిసిందే.. అంటూ చెప్పుకొచ్చారు.

Advertisement

Next Story