సైకిల్‌ను ఈ- బైక్‌గా మార్చే 'ఈజీ కిట్'

by Web Desk |
సైకిల్‌ను ఈ- బైక్‌గా మార్చే ఈజీ కిట్
X

దిశ, ఫీచర్స్ : ముంబై స్టార్టప్ కంపెనీ 'స్ట్రిక్ట్‌లీ ఎలక్ట్రిక్'.. సాధారణ సైకిల్‌ను సులభంగా ఎలక్ట్రిక్ పవర్డ్ టూ-వీలర్‌గా మార్చేయగల DIY కిట్‌‌ను రూపొందించింది. హ్యాండ్‌బ్యాగ్ లేదా బ్యాక్‌ప్యాక్‌లో సులభంగా తీసుకెళ్లగలిగే పోర్టబుల్ బ్యాటరీతో పాటు ఈ కిట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్‌ పెరుగుతున్న నేపథ్యంలో ముంబై యువకులు దుర్గేష్ గరుడ్, మిహిర్ పవార్.. సైకిల్‌నే ఎలక్ట్రిక్ వెహికిల్‌గా మార్చాలనుకున్నారు.

ఈ క్రమంలోనే మోటరైజ్డ్ ఫ్రంట్ వీల్, డిజిటల్ కంట్రోలర్, బ్యాటరీ బ్యాక్, బ్రేకింగ్, వైరింగ్ సెటప్‌తో కూడిన 'ది ఈజీ కిట్'‌ డిజైన్ చేశారు. ఈ కిట్ ఉపయోగించి బేసిక్ సైకిల్‌ను కేవలం 20 నిమిషాల్లో ఎలక్ట్రిక్ మోడ్‌లోకి మార్చవచ్చు. ఇందుకోసం సైకిల్ ఫ్రంట్ వీల్‌కు 250W మోటార్‌ను ఫిట్ చేస్తారు. ఇది థ్రోటెల్(Throttle) మోడ్‌లో గంటకు 25 కిలోమీటర్ల వేగాన్ని అందిస్తుంది. ఇక హ్యాండిల్‌ బార్‌పై ఉండే కంట్రోల్ ప్యానెల్ సాయంతో సైకిల్ రైడ్‌ను 'అసిస్ట్ లేదా థ్రోటెల్ మోడ్‌'లోకి మార్చుకోవచ్చు.




209 Wt-Hr యూనిట్ సామర్థ్యం గల బ్యాటరీ.. థ్రోటెల్ మోడ్‌లో 25 కిమీ, అసిస్ట్ మోడ్‌లో 40 కిమీ ప్రయాణాన్ని అందిస్తుంది. కిట్‌లోని 2A చార్జర్‌.. గంటలో 70 శాతం బ్యాటరీని చార్జ్ చేస్తుంది. ఈ ఎలక్ట్రిక్ కిట్ ధర దాదాపు రూ. 29,999/- ఉండగా.. కస్టమర్లు తమ వెబ్‌సైట్‌లో రూ. 499కే ప్రీ-బుక్ చేయవచ్చని స్ట్రిక్ట్‌లీ ఎలక్ట్రిక్ పేర్కొంది. ఒకవేళ కస్టమర్‌కు సైకిల్ లేకపోతే, కిట్‌‌తో ప్రీఇన్‌స్టాల్ చేయబడిన సైకిల్ యూనిట్‌ను రూ. 37,499/-కు విక్రయిస్తారు. కాగా మరో కంపెనీ 'ధృవ్ విద్యుత్' కూడా కొన్ని వారాల కిందటే DVECK పేరుతో ఎలక్ట్రిక్ కన్వర్షన్ కిట్‌ను మార్కెట్‌లో రిలీజ్ చేసింది.






Next Story

Most Viewed