పినపాకలో ములుగు ఎమ్మెల్యే సితక్క పర్యటన

by Disha News Desk |
పినపాకలో ములుగు ఎమ్మెల్యే సితక్క పర్యటన
X

దిశ, మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక, కరకగూడెం మండలాల్లో ములుగు ఎమ్మెల్యే సీతక్క పర్యటించారు. మంగళవారం కరకగూడెం మండలం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సయ్యద్ ఇబ్బల్ హుస్సేన్ నివాసానికి విచ్చేశారు. అనంతరం ఆయన కుటుంబ విషయాలను అడిగి తెలుసుకున్నారు. అక్కడి నుంచి నేరుగా పినపాక మండలం చింతల బయ్యారంలో మహా శివరాత్రి సందర్భంగా శివుడిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ.. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా వ్యక్తిగత పర్యటనలో శివుడిని దర్శించుకున్నానని తెలిపారు.

శివుడి ఆశీర్వాదం ప్రజాలందరిపై ఉండాలని కోరుకున్నానని అన్నారు. వ్యక్తిగతంగా శివుడి దర్శనం కోసమే తప్ప ఎవరిని ఉద్దేశించి కాదని, రాజకీయ విషయాల గురించి కానేకాదని అక్క స్పష్టం చేశారు. అనంతరం సీతక్కను చూసేందుకు జనం భారీగా తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ యువజన నాయకులు భజన సతీష్, కాంగ్రెస్ సోషల్ మీడియా సభ్యులు అచ్చా నవీన్, స్థానిక ప్రజాప్రతినిధులు-యువజన కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story