2030 నాటికి 1 ట్రిలియన్ డాలర్లకు భారత సరుకుల ఎగుమతులు: సీఐఐ!

by Disha Desk |
2030 నాటికి 1 ట్రిలియన్ డాలర్లకు భారత సరుకుల ఎగుమతులు: సీఐఐ!
X

దిశ, వెబ్‌డెస్క్: 2030 నాటికి దేశీయ సరుకుల ఎగుమతులను 1 ట్రిలియన్ డాలర్లకు చేర్చేందుకు భారత్ బహుళ విధానాలను అమలు చేయాల్సిన అవసరం ఉందని పరిశ్రమల సమాఖ్య సీఐఐ నివేదిక అభిప్రాయపడింది. దీనికోసం పెద్ద మార్కెట్లతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను ఖరారు చేయడం, అన్ని ఎగుమతి ఉత్పత్తులపై సుంకాలు, పన్నుల వాపసును విస్తరించడం, ప్రపంచ సంస్థలను ఆకర్షించడం, లక్ష్యాలను సాధించేందుకు దేశీయ తయారీ సమస్యలను పరిష్కరించడం లాంటి అంశాలను పరిశీలించాలని సీఐఐ నివేదిక సూచించింది. సమగ్రమైన విధానాలను అనుసరించడం ద్వారా అనుకున్న లక్ష్యాన్ని సాధించడం సులభతరమేనని సీఐఐ అధ్యక్షుడు టి వి నరేంద్రన్ అన్నారు. ఆదివారం సీఐఐ విడుదల చేసిన నివేదికలో.. భారత్ గ్లోబల్ సరఫరాను అందుకోవాలని, దానికోసం కీలక రంగాల్లో ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించాలని పేర్కొంది. ప్రపంచ సరఫరాలో వాటా సాధించే సామర్థ్యం భారత్‌కు ఉందని, భవిష్యత్తులో ఎగుమతుల పెరుగుదలకు అత్యంత దోహదపడే 14 రకాల ఉత్పత్తులను సీఐఐ సూచించింది. వాటిలో వాహనాలతో పాటు దుస్తులు, ఎలక్ట్రిక్ పరికరాలు, యంత్రాలు, రసాయన ఉత్పత్తులు, ప్లాస్టిక్, ఫార్మా ఉత్పత్తులు మొదలైనవి ఉన్నాయి.

Advertisement

Next Story