మరో సారీ అభిమానులను ఆశ్చర్య పరిచిన MS Dhoni

by Mahesh |   ( Updated:2022-04-04 06:01:09.0  )
మరో సారీ అభిమానులను ఆశ్చర్య పరిచిన MS Dhoni
X

దశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2022లో నిన్న పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో ధోని మరోసారి తన అభిమానుల హృదయాలను కొల్లగొట్టాడు. సాధారణంగానే వికెట్ల వెనుక చాలా చురుకుగా ఉండే ధోని మరోసారి తన ఫిట్ నెస్ ని చూపించాడు. పంజాబ్ బ్యాట్స్మెన్ భానుక రాజపక్స క్రిస్ జోర్డాన్ ఓవర్ లో సింగల్ కి ప్రయత్నించాడు. అప్పుడు బాల్ సర్కిల్ లోపలే ఉండటం వల్ల భానుక సింగల్ నుంచి వెనుదిరిగే ప్రయత్నం చెసాడు. అయితే రనౌట్ కి త్రో విసిరిన ఫిల్డర్ బంతిన చాలా ధోనికి విసిరాడు. అప్పుడు ధోని వికెట్లకు చాలా దూరంగా ఉన్నారు.

అయినావేగంగా పరిగెత్తి బంతిని అందుకున్న ధోని రాజపక్స కంటే ముందే వికెట్లను చేరుకుని రనౌట్ చేశాడు. ధోనీ రనౌట్ చేసిన విధానం వికెట్ల బ్యాక్ కెమెరాలో రికార్డు అయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో కొనసాగుతుంది. అయితే గతంలో కూడా ధోని ఒక సారి ఇలానే బంగ్లాదేశ్ ఆటగాడిని రనౌట్ చేశాడు. ఈ రనౌట్ విధానం చూసిన అందరూ 40 సంవత్సరాలున్న.. ధోని ఫిట్ నేస్ ఇంకా అలాగే ఉందని ఆయన అభిమానులు ధోనిని ఆకాశానికి ఎత్తేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed