- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కిట్స్ కళాశాలలో మిస్టర్ ప్రెగ్నెంట్ చిత్ర యూనిట్ సందడి
దిశ, కోదాడ: కోదాడ పట్టణంలోని కిట్స్ ఇంజనీరింగ్ కళాశాలలో శనివారం మిస్టర్ ప్రెగ్నెంట్ చిత్ర యూనిట్ సందడి చేసింది. చిత్ర హీరో బిగ్ బాస్ విన్నర్ సోహెల్ రెహన్, హీరోయిన్ రూప లకు కళాశాల విద్యార్థులు కేరింతలతో ఘన స్వాగతం పలికారు. విద్యార్థినిలు జోష్ తో కేరింతలు కొడుతూ ఆనందోత్సవాలు వ్యక్తం చేశారు. చిత్ర నిర్మాత లు అప్పి రెడ్డి,రవి రెడ్డి,దర్శకుడు శ్రీనివాస్ లు మాట్లాడుతూ విభిన్న మైన కధ తో నిర్మించిన చిత్రం ఇది అన్నారు. చిత్రం లో పురుషుడు ప్రెగ్నెంట్ అయితే ఎలా ఉంటుందని పలు హాస్య సన్నీ వేషాలతో సినిమా తీసామన్నారు.సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందన్నారు. మహిళ ప్రసవం కష్టాలతో తీసిన సినిమా కు మహిళలు ఆదరించాలన్నారు.
ఇంతకు ముందు జార్జి రెడ్డి, ప్రెషర్ కుక్కర్ సినిమాలు చేశామన్నారు. చిత్రం హీరో సోహెల్, హీరోయిన్ రూప లు మాట్లాడుతూ విధార్ధినిల ఉత్సాహం చూసి ఆనందంగా ఉందన్నారు. కళాశాల చైర్మన్ నీలా సత్య నారాయణ మాట్లాడుతూ.. కోదాడ కు చెందిన యువ పారిశ్రామిక వేత్త అప్పిరెడ్డి గ్రామీణ ప్రాంత విద్యార్థులకు తమ సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగ అవకాశాలు కల్పించడంతో పాటు చిత్ర నిర్మాత గా మంచి సినిమాలు తీస్తూ పేరు తేవడం అభినందనీయం అన్నారు. చివర్లో హీరో హీరోయిన్ లు పాటకు వేసిన స్టెప్పులు మరింత జోష్ ను ఇచ్చాయి. ఈ కార్యక్రమంలో యూనిట్ సిఇఓ చక్రధర్, కళాశాల ప్రిన్సిపాల్ డా.నాగార్జున రావు, చిత్ర బృందం అభిషేక్, అవినాష్, కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు.