తెలంగాణలో ఆ పథకం అమలు కాక రైతులు నష్టపోతున్నారు..

by Vinod kumar |   ( Updated:2022-03-21 11:31:26.0  )
తెలంగాణలో ఆ పథకం అమలు కాక రైతులు నష్టపోతున్నారు..
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: గత ఏడాది కురిసిన అకాల వర్షాల వల్ల పసుపు పంటకు తీవ్ర నష్టం జరిగింది. తెలంగాణలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రధాన మంత్రి ఫసల్‌ భీమా యోజన పథకాన్ని అమలు చేయకపోవడంతో తెలంగాణ రైతులు తీవ్రంగా నష్టపోయారు. రైతులకు నష్ట పరిహారాన్ని అందించి ఆదుకోవాలని తెలంగాణ ఎంపీలు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కు మొరపెట్టుకున్నారు.


సోమవారం ఎంపీలు దర్మపూరి అరవింద్, బండి సంజయ్, సోయం బాపు రావు లు పార్లమెంట్ లో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో గతేడాది కురిసిన అకాల వర్షాల వల్ల పసుపు పంటకు జరిగిన నష్టాన్ని ఆయనకు వివరించి.. రైతులకు పరిహారం అందించడం పై చర్చించడం జరిగింది. తెలంగాణలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రధాన మంత్రి ఫసల్‌ భీమా యోజన పథకాన్ని అమలు చేయకపోవడంతో తెలంగాణ రైతులు తీవ్రంగా నష్టపోయారని ఎంపీల బృందం పీయూష్ గోయల్ కు వివరించారు.


దానికి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సమాధానం ఇస్తూ తెలంగాణ రాష్ట్రంలో ప్రధాన మంత్రి ఫసల్ భీమా యోజన అమలు చేయకపోవడం పట్ల నిరాశను వ్యక్తం చేశారు. రైతులకు అకాల వర్షం వలన జరిగిన పంట నష్టం పరిహారం కోసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదన రావాలని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed