ఆ కుటుంబాలకు ప్రభుత్వం రూ.25 లక్షలు ఇవ్వాలి: కోమటిరెడ్డి

by GSrikanth |
ఆ కుటుంబాలకు ప్రభుత్వం రూ.25 లక్షలు ఇవ్వాలి: కోమటిరెడ్డి
X

దిశ, ఆలేరు: యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు సమీపంలో రోడ్డు ప్రమాదంలో మరణించిన కుటుంబాలకు ప్రభుత్వం రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం ఆలేరు ప్రభుత్వ ఆస్పత్రిలో బాధిత పరామర్శించి, ఓదార్చారు. చనిపోయిన రెండు కుటుంబాలకు తన వంతు సాయంగా, ఒక్కొక్క కుటుంబానికి లక్ష రూపాయలు ఇస్తానని ఎంపీ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కోమటిరెడ్డితో పాటు కాంగ్రెస్ నాయకులు జనగామ ఉపేందర్ రెడ్డి, బీర్ల అయిలయ్య, ప్రమోద్ కుమార్, తంగల్లపల్లి రవికుమార్, వెంకటేష్, ఆలేరు, యాదగిరిగుట్ట ఎంపీపీలు గందమల్ల అశోక్, శ్రీశ్తెలం, ఎంఏ ఏజాజ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story