వాళ్ల ఇళ్లను కూల్చేస్తున్న ప్రభుత్వం.. అలా చేసినందుకే..

by Javid Pasha |   ( Updated:2022-04-11 13:10:33.0  )
వాళ్ల ఇళ్లను కూల్చేస్తున్న ప్రభుత్వం.. అలా చేసినందుకే..
X

దిశ, వెబ్‌డెస్క్: అధికారులు బుల్డోజర్లతో ఇళ్లను కూల్చేస్తున్నారు. ఎందుకని ప్రశ్నిస్తే ప్రభుత్వం చెప్పింది, మేము చేస్తున్నామంటున్నారు. అయితే ఈ ఘటన మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలో చోటు చేసుకుంది. రాష్ట్రంలో ఆదివారం శ్రీరామ నవమి సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ క్రమంలో నిర్వహిస్తున్న ఊరేగింపుపై కొందరు రాళ్లు విసిరారు. దాంతో అక్కడ మత ఘర్షణలు జరిగాయి. వెంటనే పోలీసులు జోక్యం చేసుకున్నారు. అయితే ఊరేగింపుపై రాళ్లు విసిరిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. వారి ఇళ్లను కూల్చేయాలని ఆదేశాలు ఇచ్చింది. అంతే అధికారులు బుల్డోజర్లు వేసుకొని వారి ఇళ్లను కూల్చే పనిలో నిమగ్నమయ్యారు. దీనికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అయితే మధ్యప్రదేశ్ హోమ్ మంత్రి నరోత్తం మిశ్రా ఈ విషయంపై మాట్లాడుతూ.. శ్రీరామనవమి ఊరేగింపుపై రాళ్లు విసిరిన వారి ఇళ్లు రాళ్ల గుట్టలుగా మారతాయని అన్నారు. అన్నట్లుగానే వారి ఇళ్లను భూస్తాపితం చేయిస్తున్నారు. అయితే మత ఘర్షణల కేసులో దాదాపు 77 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

Next Story

Most Viewed