హోటల్స్‌కు సీఎం కీలక ఆదేశాలు.. అవన్నీ అలానే ఉండాలంటూ..

by Javid Pasha |   ( Updated:2022-04-03 11:42:16.0  )
హోటల్స్‌కు సీఎం కీలక ఆదేశాలు.. అవన్నీ అలానే ఉండాలంటూ..
X

దిశ, వెబ్‌డెస్క్: హోటల్ యజమానులకు ముఖ్యమంత్రి కీలక సూచనలు చేశారు. ఇకపై హోటల్ సైన్ బోర్టులన్నీ ఆ భాషలోనే ఉండాలంటూ ఆదేశాలు ఇచ్చారు. మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ రాష్ట్రంలోని హోటల్ యజమానులకు కీలక సూచనలు చేశారు. ఈ ఆదేశాలను ప్రతి ఒక్కరూ పాటించాలని తెలిపారు. అయితే ఇకపై ప్రతి హోటల్ సైన్ బోర్డ్‌లన్నీ కూడా ఇంగ్లీషులో కాకుండా హిందీలోనే ఉండాలంటూ ఆదేశాలు ఇచ్చారు. 'మన విద్యారంగ అభివృద్ధి భాషను అభివృద్ధితోనే జరుగుతుంది' అని శివరాజ్ అన్నారు. అంతేకాకుండా ఉజ్జయిని వీధుల్లో బిక్షగాళ్లు లేకుండా చేసేందుకు ప్రయత్నించాలని, దాంతో పాటుగా ప్రతి రోజూ పేదవారికి భారీగా అన్న దానం చేయాలని ఆయన సూచించారు.



Advertisement

Next Story