ఎంపీ రఘురామ ఇంటి వద్ద గుర్తు తెలియని వ్యక్తుల సంచారం

by Nagaya |
ఎంపీ రఘురామ ఇంటి వద్ద గుర్తు తెలియని వ్యక్తుల సంచారం
X

దిశ, వెబ్​డెస్క్: వైఎస్​ఆర్​ సీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఇంటి వద్ద అగంతకుల సంచారం కలకలం సృష్టించింది. హైదరాబాద్​లోని గచ్చిబౌలిలో ఉన్న రఘురామ ఇంటి వద్ద సోమవారం ఉదయం ఓ గుర్తు తెలియని వ్యక్తి అనుమానస్పదంగా తిరుగుతూ హల్​చల్​ చేశాడు. గమనించిన ఎంపీ అనుచరులు అతడిని పట్టుకుని ప్రశ్నించారు. తన పేరు సుభాష్​ అని.. విజయవాడ నుంచి వచ్చినట్లు పేర్కొన్నాడని సమాచారం. అతడితోపాటు మరో ఆరుగురు కూడా విజయవాడ నుంచి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే వారంతా ఎందుకు వచ్చారు..? ఎంపీ ఇంటి వద్ద అనుమానస్పదంగా ఎందుకు తిరుగుతున్నారో తెలియాల్సి ఉంది. రఘురామ అనుచరులు గుర్తు తెలియని వ్యక్తిని గచ్చిబౌలి పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story

Most Viewed