- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పరిగి మండలంలో తల్లీకూతుళ్లు అదృశ్యం
దిశ, పరిగి : ఇంటి నుంచి బయటకు వెళ్లిన తల్లీకూతుళ్లు అదృశ్యమయ్యారు. బాధిత కుటుంబీకులు, పరిగి ఎస్ఐ పి.విఠల్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం...పరిగి మండలం మాదారం గ్రామానికి చెందిన శివగళ్ల నందకుమార్, స్వప్న(23) భార్యాభర్తలు. స్వప్న ఈ నెల 13వ తేదీన ఇంటి నుంచి బయటికి వెళ్లింది. ఆమెతో పాటు 6 నెలల పాల (మిల్కి)నీ కూడా తీసుకొని వెళ్లింది. వాళ్లు బయటకెళ్ళి 13 రోజులవుతున్నా తిరిగి రాలేదు. ఈ క్రమంలో కుటుంబీకులు మాదారం, పరిగి తోపాటు బంధువులు, సన్నిహితుల ఇండ్లల్లో వెతికారు. కానీ ఎక్కడా ఆచూకి లభించలేదు. దీంతో కుటుంబీకులు పరిగి పోలీస్ స్టేషన్ లో ఈ నెల 13వ తేదీన ఫిర్యాదు చేశారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ పి.విఠల్‌రెడ్డి తెలిపారు. ఆచూకి తెలిసిన వారు పరిగి ఎస్ఐ పి.విఠల్‌రెడ్డి 9440627260 నెల్ నెంబరుకు సమాచారం ఇవ్వాలని కోరారు.