- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఉక్రెయిన్ రైల్వే స్టేషన్‌పై రష్యా రాకెట్ దాడి!
కీవ్: ఓ వైపు బలగాలను వెనక్కి మళ్లిస్తూనే, మరోవైపు రష్యా దాడులను కొనసాగిస్తుంది. తూర్పు ఉక్రెయిన్ లో రైల్వే స్టేషన్ సమీపంలో రాకెట్లతో దాడులకు తెగబడినట్లు ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో 35 మంది మరణించగా, మరో 100 మందికి పైగా గాయపడినట్లు చెప్పారు. డొనెట్క్స్ ప్రాంతంలోని క్రమటోర్క్స్ లో ఈ దాడులు జరిగాయని అధికారులు వెల్లడించారు. దాడి సమయంలో స్టేషన్ లో వేల సంఖ్యలో జనం ఉన్నట్లు ప్రాంతీయ గవర్నర్ పావ్లో కెరిలెంకో తెలిపారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే క్రమంలో ఈ దాడులు జరిగినట్లు చెప్పారు. రెండు రాకెట్లు స్టేషన్ సమీపంలో పడ్డాయని అన్నారు. కాగా, ఉక్రెయిన్ ప్రధాన నగరాల నుంచి బలగాలను వెనక్కి మళ్లించిన రష్యా, తూర్పు ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడుతుంది. దీంతో తూర్పు ప్రాంతంలో ఉన్న ప్రజలను పశ్చిమం వైపుగా రావాలని ఉక్రెయిన్ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.