- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆమెతో శృంగారం తర్వాతే పాన్సెక్స్వల్గా మారిపోయా.. స్టార్ నటి
దిశ, సినిమా: ప్రముఖ అమెరికన్ గాయని, నటి మోనికా డోగ్రా.. తన పాన్సెక్స్వల్ లక్షణాలతో పాటు సీక్రెట్ మ్యారేజ్ గురించి ఓపెన్ అయింది. క్వీర్ కమ్యూనిటీలో పెరిగిన తాను లింగ బేధం గురించి తెలుసుకుని చాలా సిగ్గుపడ్డట్లు తెలిపింది. కాలేజీలో చదివే వరకు తానెప్పుడూ అమ్మాయిలను ముద్దుపెట్టుకోలేదని, వారి పట్ల లైంగిక అనుభూతిని పొందలేదని వెల్లడించిన మోనిక.. అకస్మాత్తుగా ఒక మహిళతో శృంగారంలో పాల్గొన్న తర్వాతే తాను పాన్సెక్స్వల్ అనే విషయం అర్థమైందని చెప్పింది. ఈ ఐడెంటిటీలో అనేక కొత్త పద్ధతులున్నప్పటికీ తనకు ఇప్పటికీ పూర్తిగా అర్థంకాలేదన్న నటి.. స్త్రీ, పురుషులు ఒకరి శక్తిని మరొకరు బలంగా ఇష్టపడతారని తెలుసుకున్నాక, తన భర్తకు సరిపోనని అర్థ చేసుకుని విడిపోయినట్లు వెల్లడించింది. ఇక 2016లో ఎల్జీబీటీ కమ్యూనిటీ కోసం క్రౌడ్ ఫండింగ్ క్యాంపెయిన్ చేసినప్పుడు లైంగికత విషయంలో భారతీయ మీడియా రాసిన ద్వేషపూరిత కథనం తనను చాలా వెనక్కి నెట్టివేసిందన్న మోనిక.. చివరగా ఎవరి జీవితంలోనైనా గాఢమైన ప్రేమను అనుభవించడం అదృష్టమని చెప్పుకొచ్చింది.