- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అసెంబ్లీలో రసమయి సీరియస్.. స్పీకర్‌పై తీరుపై అసంతృప్తి
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రెండో శనివారం అయినప్పటికీ కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో బడ్జెట్ పద్దులపై శాసనసభలో చర్చ మొదలైంది. ఈ క్రమంలో ముదిరాజుల కుటుంబాలు ఎక్కువగా ఉండే నియోజకవర్గమైన మానకొండూరు నియోజకవర్గంలో చేపల పెంపకంతో పాటు కోల్డ్ స్టోరేజీ కోసం ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అసెంబ్లీలో ప్రశ్నో్త్తరాల సమయంలో మాట్లాడారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పెరిగిన చేపల ఉత్పత్తి గురించి మాట్లాడుతుండగా ప్రశ్న ఏంటో చెప్పాలంటూ.. డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ మైక్ కట్ చేశారు. దీంతో సీరియస్ అయిన రసమయి.. ''మంత్రిని అడగలేకపోతే ప్రశ్నలివ్వడం ఎందుకు అధ్యక్ష.. మానకొండూరులో ముఖ్యమైన విషయం అధ్యక్ష.. అడగనివ్వకపోతే ఇగ కూర్చుంటం.. మాట్లాడే అవకాశాలు ఎలాగో రావు.. ఇక్కడ కూడా ప్రశ్నలు అడుక్కునే అవకాశాలు రానియ్యకుంటే ఎట్ల.. మంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తున్నా.. ఒక కోల్డ్ స్టోరేజీతో కూడిన మార్కెట్‌ను ఏర్పాటు చేయాలి'' అని రసమయి కోరారు.
అంతేగాకుండా, నియోజకవర్గంలోని యువకులకు వాహనాలు ఇవ్వాలని, మొబైల్ మార్కెట్ కి సంబంధించినవి అవకాశం కల్పించాలని దరఖాస్తులు వస్తున్నాయని వాటి గురించి ఆలోచించాలని మంత్రిని కోరారు. రసమయి అసంతృప్తి వ్యాఖ్యలతో పార్టీ అధిష్టానానికి ఎమ్మెల్యేకు దూరం పెరిగిందని అర్ధమవుతుందంటూ సోషల్ మీడియాలో చర్చిస్తున్నారు. రసమయి మొదటి నుంచి ఈటల రాజేందర్ వైపు ఉండటం వల్లే ఇలాంటి అవమానాలు ఎదురవుతున్నాయని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.