‘సార్ మీకు గుడి కట్టిస్తా’ అని గట్టిగా అరిచిన అభిమాని.. పవన్ కల్యాణ్ షాకింగ్ రిప్లై (వీడియో)

by Gantepaka Srikanth |   ( Updated:2024-12-20 14:04:47.0  )
‘సార్ మీకు గుడి కట్టిస్తా’ అని గట్టిగా అరిచిన అభిమాని.. పవన్ కల్యాణ్ షాకింగ్ రిప్లై (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్(Pawan Kalyan) శుక్రవారం పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా మక్కువ మండలం పనసభద్ర పంచాయతీ బాగుజోల గ్రామం(Bagujola village)లో నూతన రహదారి పనులకు శంకుస్థాపన చేశారు. గ్రామంలో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను చూశారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంభ సభలో పాల్గొని మాట్లాడారు. ఈ క్రమంలో గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ‘సార్ మీకు గుడి కట్టిస్తా’ అని అన్నారు. దీనికి పవన్ కల్యాణ్ స్పందించారు. నాకు గుడి వద్దు.. మనందరికి బడి కావాలి. పిల్లలకు నాణ్యమైన విద్య అందాలి. అలా జరిగితే గుడి కట్టించిన దానికంటే ఎక్కువ ఆనందపడతాను అని పవన్ కల్యాణ్ చెప్పారు.

దీంతో నిజంగా మీరు సూపర్ సార్ అంటూ గ్రామస్తులు, అధికారులు, అభిమానులు కొనియాడారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గిరిజన ప్రాంతాలు అభివృద్ధి చెందే విధంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని పవన్‌ కల్యాణ్ అన్నారు. కూటమి ప్రభుత్వం వద్ద డబ్బు లేకపోయినా గిరిజన ప్రాంతాల్లో రహదారులు నిర్మిస్తున్నట్లు చెప్పారు. సుందరమైన జలపాతాలు ఉన్న ఈ ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసుకోవాలని చెప్పారు.

Next Story

Most Viewed