Google layoffs: ఉద్యోగులకు గూగుల్ బిగ్ షాక్.. 10 శాతం మంది తొలగింపు..!

by Maddikunta Saikiran |
Google layoffs: ఉద్యోగులకు గూగుల్ బిగ్ షాక్.. 10 శాతం మంది తొలగింపు..!
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా మహమ్మారి వల్ల ఏర్పడిన ఆర్ధిక సంక్షోభంతో(Financial Crisis) ప్రపంచ వ్యాప్తంగా దిగ్గజ కంపెనీలు ఇటీవల కాలంలో భారీగా లేఆఫ్స్‌(layoffs) ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. అమెజాన్(Amazon), టెస్లా(Tesla), మెటా(Meta) వంటి సంస్థలు పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తొలగించగా.. తాజాగా అమెరికా(USA)కు చెందిన ప్రముఖ గ్లోబల్ టెక్ దిగ్గజ కంపెనీ గూగూల్(Google) తన ఉద్యోగులకు బిగ్ షాకిచ్చింది. మేనేజ్‌మెంట్(Management) విభాగంలో పనిచేస్తున్న వారిలో 10 శాతం ఉద్యోగులను విధుల నుంచి తొలగించేందుకు రెడీ అయ్యింది. ముఖ్యంగా మేనేజర్(Manager), డైరెక్టర్(Director), వైస్‌ ప్రెసిడెంట్(VP) వంటి రోల్స్(Roles)లో ఈ లేఆఫ్స్‌ ఉండనున్నాయి. ఈ మేరకు లేఆఫ్స్‌ విషయాన్ని సంస్థ సీఈఓ సుందర్ పిచాయ్(Sundar Pichai) శుక్రవారం ఓ ప్రకటనలో అధికారికంగా వెల్లడించారు.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) ద్వారా ప్రపంచంలో ఉన్న పోటీని ఎదుర్కొనేందుకు.. ఓపెన్ ఏఐ(Open AI) లాంటి సంస్థల నుంచి గట్టి పోటీ ఉన్నందున తన స్కిల్స్ డెవలప్(skills Develop) చేసుకునేందుకు ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని తెలిపారు. కొంతమంది హోదా తగ్గించి వ్యక్తిగత పాత్రలకు పరిమితం చేస్తామని, మరికొంతమందిని సంస్థ నుంచి పూర్తిగా తొలగిస్తామని పిచాయ్ పేర్కొన్నారు. కాగా గూగుల్ గత ఏడాది(2023) ఏకంగా 12 వేల మంది ఉద్యోగులను తొలగించింది. గూగుల్ కు పోటీగా ఓపెన్ ఏఐ సెర్చ్ ఇంజిన్(Search Engine) ఆప్షన్ తీసుకొస్తున్న వేళ ఈ లేఆఫ్స్‌ ప్రకటించడం గమనార్హం.

Advertisement

Next Story

Most Viewed