Jagga Reddy: నోరు విప్పిన జగ్గారెడ్డి.. సంచలన ప్రకటనపై క్లారిటీ

by Nagaya |   ( Updated:2022-07-04 11:34:05.0  )
MLA Jagga Reddy Comments On BJP Vijaya Sankalpa Sabha
X

దిశ, తెలంగాణ బ్యూరో : MLA Jagga Reddy Comments On BJP Vijaya Sankalpa Sabha| సంచలన ప్రకటన చేస్తా అన్న కాంగ్రెస్​ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సోమవారం నోరు విప్పారు. కాంగ్రెస్ పార్టీ మంచి కోసం.. విజయం కోసమే జగ్గారెడ్డి ఎప్పుడూ మాట్లాడుతాడని, గ్రామ స్థాయి నుండీ రాజధాని వరకు తాను ఏం మాట్లాడినా నెగిటివ్గా తీసుకోవద్దని ఆయన కోరారు. తాను కాంగ్రెస్​ పార్టీలోనే ఉంటానని, ఎక్కడికీ పోనని జగ్గారెడ్డి తేల్చి చెప్పారు. నేను చేస్తానన్న సంచనల వ్యాఖ్యలకు ఇంకా టైం ఉందన్నారు. నన్ను ఎవరు డామినేట్ చేయలేరని, నేను ఒకరు చెప్పింది అసలు విననని, నేను ఎవరికీ లాలూచీ పడనని పేర్కొన్నారు. మరోవైపు బీజేపీ, ప్రధాని మోడీపై విమర్శలు చేశారు జగ్గారెడ్డి.

తెలంగాణ రాష్ట్రం బీజేపీకి ప్రధానికి గెస్ట్ హౌజ్ అయిపోయిందని విమర్శించారు. రూ.15 లక్షలు ఇస్తాడేమో అని తెలంగాణ ప్రజలు ఆశపడ్డారని, అదీ లేకపోగా ఉద్యోగాలు గురించి మాట్లాడలేదు.. అగ్నిపథ్ రద్దు పై చెప్పలేదని మండిపడ్డారు. బండి సంజయ్ ,కిషన్ రెడ్డి ఏం ముఖం పెట్టుకుని పాదయాత్ర చేస్తారని ప్రశ్నించారు. కార్యవర్గ సమావేశాలు మీరు ముఖాలు చూసుకోవడానికి పెట్టుకున్నారా...? బీజేపీ కార్యవర్గ సమావేశాలు పెళ్లి చూపులు లాగా ఉన్నాయని ఎద్దేవా చేశారు.

రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఏ హామీ నెరవేర్చలేదని, బీజేపీ సమావేశాలు, హామీలు నెరవేర్చని ప్రధాని పర్యటనను ఖండిస్తున్నామని జగ్గారెడ్డి అన్నారు. ఉన్న ఇంజనే సరిగా పని చేయడం లేదు... డబుల్ ఇంజన్ ఎందుకని చురకలు అంటించారు. ఏం హామీలు నెరవేర్చకుండా భాగ్యలక్ష్మి అమ్మవారి పేరు చెప్పి దండం పెట్టి వెళ్లిపోయారన్నారు. రాష్ట్రం రాకముందు ఇసుక తక్కువ ధరకు దొరికేదని, రాష్ట్రం వచ్చిన తర్వాత ఇసుక తవ్వకాలు ఆపేసి కరీంనగర్ మాత్రమే పరిమితం చేశారని వాపోయారు. ఇసుక దందా వల్ల కరీంనగర్ నుండి హైదరాబాద్ రావడానికి ఒక లోడు లక్ష అవుతుంది అని తెలిపారు. బ్లాక్ మని ఫార్మా ,ఇసుక దందాలోనే ఎక్కువ వస్తుందని, ఫార్మాకు పార్థసారథి రెడ్డి మాఫియా... ఇసుక దందాకు సంతోష్ రావు మాఫియా డాన్ అని తీవ్ర ఆరోపణలు చేశారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా మాఫియాగా మారిపోయారని వ్యాఖ్యానించారు. ఇసుక దందాని కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని జగ్గారెడ్డి చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed