- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దమ్ముంటే మాతో తేల్చుకో.. రైతులను ఇబ్బంది పెట్టకు: Eatala Rajender
దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి కేసీఆర్‌పై మాజీ మంత్రి, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లోని నాంపల్లి బీజేపీ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశానికే ధాన్యగారంగా తెలంగాణ పేరొందింది అన్నారు. కోటి ఎకరాల మాగాణి చేస్తానని ముఖ్యమంత్రి కేసీఆర్ గొప్పలు చెప్పుకున్నారని ఎద్దేవా చేశారు. కేరళ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో వరి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమవుతాయని, కానీ తెలంగాణలో కొనుగోలు విషయం ఏమవుతుందో అని రైతులు ఆందోళన చెందుతున్నారని అన్నారు. ''వర్షాకాలం పంటకైనా.. ఏ పంటకైనా నీళ్లు అందిస్తామని కేసీఆర్ ప్రకటన చేశారు. కందులు, మొక్కజొన్న, వరి అన్నీ కొంటున్నామని చెప్పుకున్నారు. హుజురాబాద్ ఎన్నికల్లో కూడా దేశంలో కెల్లా అన్ని రకాల ధాన్యాలను కొనేది తెలంగాణ ప్రభుత్వమేనని గొప్పలు చెప్పుకున్నారు. ఎంతమేర ధాన్యం కొనుగోళ్లు చేపట్టారనేది అధికార పార్టీకి చెందిన నమస్తే తెలంగాణ పత్రికలో ప్రచురించుకున్నారు. దేశంలో 24 గంటల నాణ్యమైన కరెంట్ అందించేది తెలంగాణ అని చెప్పుకున్నారు.
రైతు బీమా కూడా సకాలంలో అందిస్తున్నట్లు గొప్పలు చెప్పుకున్నారు. ఒక్క వ్యవసాయానికి మాత్రమే రూ.30 వేల కోట్లు ఖర్చు అవుతుందని చెప్పారు.'' ఇన్ని చెప్పి వానాకాలం పంట అప్పుడే వరి వేయొద్దని చెప్పడం నీచమైన ఆలోచన అని మండిపడ్డారు. కరెంట్ ఉందని చెప్పి, భూగర్భ జలాలు ఉన్నాయని చెప్పి కూడా వరి వేయొద్దనడం ఎంత వరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. కోటి ఎకరాలకు నీళ్లు ఇస్తున్నామని చెప్పిన కేసీఆర్, కేవలం 30 లక్షల ఎకరాలకు మాత్రమే ఇప్పుడు నీరు అందిందని అన్నారు. కేసీఆర్ కాళ్ళ కింద భూమి కదిలిపోతోంది.. ఆయన మాటలను ఎవరూ నమ్మడం లేదు. అందుకే భయంతో ఇష్యును డైవర్ట్ చేస్తున్నారని అన్నారు. కోపం మాపైన మాతో తేల్చుకో.. లేదంటే కేంద్రంతో తేల్చుకో.. కానీ, రైతులను ఇబ్బంది పెట్టొద్దని కేసీఆర్‌ను హెచ్చరించారు. వెంటనే కొనుగోళ్లు ప్రారంభించాలి. లేదా చేతకాకుంటే తప్పు ఒప్పుకొని పక్కకు తప్పుకో.. మేము కొంటామని సవాల్ విసిరారు.