ఆడపిల్లలకు అండగా నిలుద్దాం.. మిస్ యూనివర్స్

by Mahesh |
ఆడపిల్లలకు అండగా నిలుద్దాం.. మిస్ యూనివర్స్
X

దిశ, సినిమా : 2021 మిస్ యూనివ‌ర్స్ 'హ‌ర్నాజ్ సంధు' ఆడపిల్లలకు అండగా నిలుద్దామంటూ పిలుపునిచ్చింది. 21 ఏళ్ల తర్వాత భారత్‌కు మూడో మిస్ యూనివర్స్ కిరీటం సాధించిపెట్టిన హర్నాజ్‌ను అభినందించేందుకు '2021 మిస్ యూనివర్స్ గౌరవార్థం' పేరుతో చండీగఢ్‌లో ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కర్ణాటకలో చోటుచేసుకున్న 'హిజాబ్' వివాదంపై స్పందించిన ఆమె.. హిజాబ్‌తో పాటు వ‌స్త్రాధార‌ణ విష‌యాల్లో మహిళలను టార్గెట్ చేయ‌డం ఆపాల‌ని విజ్ణప్తి చేసింది.

అయినా ఎప్పుడూ ఆడపిల్లలనే ఎందుకు టార్గెట్ చేస్తారంటూ ప్రశ్నించింది. 'వాళ్లను స్వేచ్ఛగా జీవించనివ్వండి. వారు ఎంచుకున్న మార్గంలో ప్రయాణించనివ్వండి. అనుకున్న గమ్యాన్ని చేరేందుకు చేయూతనివ్వండి' అని సూచించింది. ఇక అందరిలాగే తనను కూడా టార్గెట్ చేస్తున్నారన్న అందాల భామ.. స్వేచ్ఛగా ఎగిరే రెక్కలను కత్తిరించవద్దని సమాజానికి రిక్వెస్ట్ చేస్తున్నట్లు తెలిపింది.

Advertisement

Next Story