వీళ్లు మనుషులేనా.. మైనర్ బాలికపై ఇద్దరు సోదరులు అత్యాచారం

by samatah |   ( Updated:2022-03-23 08:45:31.0  )
వీళ్లు మనుషులేనా.. మైనర్ బాలికపై ఇద్దరు సోదరులు అత్యాచారం
X

దిశ, వెబ్‌డెస్క్ : ఉత్తర్ ప్రదేశ్‌లో దారుణం చోటు చేసుకుంది. మైనర్ బాలిక‌ను ఇద్దరు సోదరులు కిడ్నాప్ చేసి సాముహిక అత్యాచారం చేశారు. వివరాల్లోకి వెళ్లితే. చుట్కాన్, బద్కన్ అనే ఇద్దరు సోదరులు.. మైనర్ బాలిక తన ఇంటి బయట ఉన్న జంతువులకు ఆహారం పెడుతుంటే ఆమెను కిడ్నాప్ చేసి, ఆమెపై అత్యాచారం చేశారు. అయితే బాలిక కనిపించకపోవడంతో తన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు గ్రామం మొత్తం వెతికినా బాలిక ఆచూకీ తెలియలేదు. అయితే ఓ వ్యక్తి బాలికను తాడుతో కట్టి చెట్ల పొదల్లో అపస్మారక స్థితిలో పడి ఉందని సమాచారం అందించారు. దీంతో కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని పోలీసులకు తెలపడంతో ఘటనా స్థలానికి పోలీసు బృందం వెళ్లి విచారణ చేపట్టగా, అక్కడ అపస్మారక స్థితిలో బాలిక ఉంది. దీంతో బాలికను వైద్యపరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఒక నిందితుడిని పోలీసులు అరెస్టు చేయగా, మరొకరు పరారీలో ఉన్నారు.

Advertisement

Next Story