చంద్రబాబు నిజాయితీకి వైసీపీ మంత్రి సవాల్.. సీబీఐ విచారణకు డిమాండ్

by Manoj |
చంద్రబాబు నిజాయితీకి వైసీపీ మంత్రి సవాల్.. సీబీఐ విచారణకు డిమాండ్
X

దిశ, ఏపీ బ్యూరో : రాష్ట్ర రాజకీయాల్లో పెగాసెస్ అంశం చర్చనీయాంశంగా మారింది. ఈ అంశంపై అటు టీడీపీ ఇటు వైసీపీల మధ్య మాటలతూటాలు పేలుతున్నాయి. పెగాసెస్‌ను చంద్రబాబు కొనులోగు చేశారని వైసీపీ ఆరోపిస్తుంటే.. మేము కొనుగోలు చేసి ఉంటే వైసీపీ అధికారంలోకి వచ్చేదా అని టీడీపీ కౌంటర్ ఇస్తోంది. తాజాగా ఇదే అంశంపై దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు ముఖ్చమంత్రిగా ఉన్నప్పుడు పెగాసస్‌ను ఉపయోగించారని మంత్రి వెల్లంపల్లి ఆరోపించారు.

ఈ విషయంలో చంద్రబాబుపై సీబీఐ విచారణ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయనున్నట్లు మంత్రి వెల్లంపల్లి తెలిపారు. ఈ కేసులో చంద్రబాబు నిజాయితీ పరుడైతే విచారణ జరపమని ఆయనే డిమాండ్‌ చేయాలంటూ సవాల్ విసిరారు. చంద్రబాబు హయాంలో తమ ఫోన్లను ట్యాప్‌ చేశారని..ఈ విషయాన్ని గత ఎన్నికల సమయంలోనే చెప్పామని గుర్తు చేశారు. తాజాగా తాము చేసిన ఆరోపణలు నిజమని నిరూపితమైందని మంత్రి వెల్లంపల్లి అభిప్రాయపడ్డారు. ప్రజా క్షేత్రంలో నిలబడలేక చంద్రబాబు ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడ్డారంటూ ధ్వజమెత్తారు.పెగాసెస్‌ను ఉపయోగించడం ద్వారా రాష్ట్రానికే కాదు యావత్ దేశ రక్షణకే విఘాతం కలిగించారని మండిపడ్డారు. పెగాసెస్ విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబును విచారించి కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed