- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మన్యంకొండ బ్రహ్మోత్సవాలు బ్రహ్మాండంగా జరగాలి: మంత్రి
దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: రాష్ట్రంలో పేదల తిరుపతిగా పేరుగాంచిన మన్యంకొండ బ్రహ్మోత్సవాలు ఈనెల 11 నుంచి 18 వరకు నిర్వహించనున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం అంతా సమన్వయంతో పనిచేసి భక్తులకు అసౌకర్యాలు కలగకుండా చూడాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ కోరారు. గురువారం జిల్లా కేంద్రంలోని జెడ్పీ సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులతో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. పాలమూరు- రాయచూరు రోడ్డు వద్ద ఉన్న ప్రవేశద్వారం నుండి కొండపై వరకు రహదారి ఇబ్బందులు లేకుండా పనులు చేపట్టాలని, డివైడర్‌లను ఏర్పాటుచేసి లైటింగ్ సౌకర్యం కల్పించాలని అధికారులను ఆదేశించారు. రోడ్డుకు ఇరువైపులా ఫుట్‌పాత్ ఏర్పాటు చేయడంతో ఫుట్‌పాత్ ఏర్పాటుచేసి పూల మొక్కలు నాటాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. పారిశుధ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపాలని, అలివేలు మంగ దేవాలయ సమీపంలోని కొండ వద్ద తాత్కాలిక టాయిలెట్లు ఏర్పాటు చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు.
కోనేరు వద్ద చివర్లో హెల్ప్‌డెస్క్, కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేయాలని, బ్రహ్మోత్సవాల సమయాల్లో విద్యుత్తు, తాగునీటి సరఫరాకు ఆటంకాలు లేకుండా చూడాలని మంత్రి కోరారు. రద్దీని తట్టుకునేందుకు బారికేడ్లు, సూచికలు బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. దేవాలయం వద్ద ఉన్న చెరువును మినీ ట్యాంక్ బండ్‌గా తీర్చిదిద్దాలని విజ్ఞప్తి చేశారు. నూతనంగా నిర్మించిన శ్రీలక్ష్మీ నరసింహ స్వామి దేవాలయ విశిష్టతను భక్తులకు తెలియజేయాలని అన్నారు. అన్నదానం తదితర కార్యక్రమాల నిర్వహణకు స్వచ్ఛంద సేవా సంస్థల సభ్యులు పాలుపంచుకోవాలని మంత్రి కోరారు. అనంతరం కలెక్టర్ వెంకట్రావు మాట్లాడుతూ.. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఎటువంటి ఆటంకాలు తలెత్తకుండా తగిన బందోబస్తు ఏర్పాటు చేస్తామని ఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ సమీక్షలో ఆలయ చైర్మన్ మధుసూదన్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్, రైతుబంధు డైరెక్టర్ నరసింహారెడ్డి, ఎంపీపీ సుధా, బీపీ అనిత, దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.