- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'ఆయన టీ అమ్మాడంటే సంతోషించాం.. ఇప్పుడు ఆ సంస్థనే అమ్మేస్తున్నాడు..'
దిశ, మహబూబాబాద్ : టీ అమ్మిన వ్యక్తి దేశ ప్రధాని అయ్యాడని అందరం సంతోషించాం.. కానీ నేడు రైల్వే సంస్థనే అమ్ముతున్నాడని నరేంద్ర మోడీపై మంత్రి సత్యవతి రాథోడ్ ధ్వజమెత్తారు. శుక్రవారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎస్టీ రిజర్వేషన్ పెంచాలని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో తీర్మానం చేసినప్పటికీ కేంద్ర మంత్రులు పార్లమెంట్ సాక్షిగా అబద్దాలు చెబుతున్నారని ఆరోపించారు.
పార్లమెంట్ లో బీజేపీ, కాంగ్రెస్ నాయకులు మాట్లాడకపోవడం సిగ్గుచేటన్నారు. ఇలాంటి గిరిజన వ్యతిరేక పార్టీలను తరిమికొట్టాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక పేదలు, గిరిజనులు, దళితులు బతుకు భారంగా మారడం బాధాకరమని అన్నారు. బయ్యారం ఉక్కు పరిశ్రమ, గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, మేడారం జాతరకు జాతీయ హోదాలపై కేంద్రం వివక్ష చూపుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. పేదలకు వ్యతిరేకంగా, పెద్దలకు అనుకూలంగా మోడీ పాలన ఉందన్నారు. గిరిజన రిజర్వేషన్ పై మాట్లాడని కాంగ్రెస్, బీజేపీ పార్టీలను గిరిజనులు నమ్మొద్దని సూచించారు.