111 జిఓపై సీఎం నిర్ణయానికి మంత్రి సబితా ఇంద్రారెడ్డి హర్షం

by Vinod kumar |
111 జిఓపై సీఎం నిర్ణయానికి మంత్రి సబితా ఇంద్రారెడ్డి హర్షం
X

దిశ ప్రతినిధి, రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లాలోని 84 గ్రామాలకు గుదిబండగా మారిన 111 జిఓ ఎత్తివేతపై సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించటం స్వాగతించదగ్గ పరిణామమని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పెర్కొన్నారు. గతంలో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీని పూర్తి చేయడానికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారని, న్యాయ పరమైన ఇబ్బందులు అధిగమించి దశల వారీగా జిఓను సడలింపు చేపడతామని సీఎం కేసీఆర్ ప్రకటించటం పట్ల మంత్రి ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. ఎన్నో ఏళ్లుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న గ్రామాల ప్రజలకు కేసీఆర్ ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని, ఆయా గ్రామాల ప్రజల తరుపున మంత్రి సబితా ఇంద్రారెడ్డి, కేసీఆర్ కి ధన్యవాదాలు తెలిపారు.

Advertisement

Next Story